పోక్సో కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప (Yediyurappa) కు తాత్కాలిక ఊరట లభించింది. ఈ కేసులో ట్రయల్ ప్రొసీడింగ్స్‌కు సుప్రీంకోర్టు బ్రేక్ వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యాతో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలు ఇచ్చింది. తన కూతురు(17)తో కలసి మాజీ సీఎం యడ్యూరప్పను ఆయన నివాసంలో కలిశానని, అప్పుడు తన కుమార్తెపై ఆయన లైంగిక దాడికి పాల్పడ్డాడని గతేడాది ఓ మహిళ ఆయనపై కేసు పెట్టింది.
దీనిపై కర్ణాటక హైకోర్టు ట్రయల్స్‌కు ఆదేశించగా, యడ్యూరప్ప (Yediyurappa) సుప్రీంను ఆశ్రయించారు. బీఎస్ తరఫున సీనియర్ లాయర్లు సిద్ధార్థ్ లూథ్రా, సిద్ధార్థ్ దవే వాదనలు వినిపించారు.ఈ సందర్భంగా వారు తమ క్లయింట్ 88 ఏళ్ల వ్యక్తని, నాలుగు సార్లు సీఎంగా పనిచేశారని, రాజకీయ వైరం కారణంగానే ఆయనపై ఈ కేసు పెట్టారని ధర్మాసనానికి నివేదించారు. దీనిపై వాదనలు విన్న అనంతరం ట్రయల్స్‌ను సుప్రీం నిలిపివేసింది.
Read Also: రోహింగ్యాలకు రెడ్ కార్పెట్ పరవాలా: సుప్రీంకోర్టు
Follow Us on: Facebook


