epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

శ్రీలంకకు పాక్ సాయం.. ఎక్స్‌పైర్ అయిపోయిన ఆహారం..

భారీ వర్షాలు, వరదల వల్ల శ్రీలంక భారీ కష్టాల్లో పడింది. ఈ ప్రకృతి వైపరిత్యాల వల్ల ఆ దేశంలో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. దీంతో అనేక దేశాలు శ్రీలంక(Sri Lanka)కు సహాయం చేయడానికి ముందుకొచ్చాయి. వాటిలో పాకిస్థాన్(Pakistan) కూడా ఒకటి. కానీ పాక్ చేసిన సహాయం చూసి అంతా ఆ దేశంపై మండిపడుతున్నారు. అందుకు కారణం శ్రీలంకకు ఎక్స్‌పయిరీ అయిపోయిన ఆహార పదార్థాలు పంపడమే. పాకిస్థాన్ పంపిన సహాయంలో పాల పౌడర్ ప్యాకెట్లు, నీళ్ల బాటిళ్లు, మెడిసిన్స్ ఉన్నాయి. వాటి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పాకిస్థాన్ పంపిన పాల పౌడర్ 2024 అక్టోబర్‌లోనే ఎక్స్‌పైర్ అయ్యిందని తెలుస్తోంది. ఎక్స్‌పైర్ అయిన పాల పౌడర్‌ను శ్రీలంకకు పంపడం, ప్యాకెట్‌పై ‘పాకిస్థాన్(Pakistan), శ్రీలంకకు అండగా నిలుస్తుంది. ఈ రోజు, ఎప్పటికీ’ అని రాసి ఉంచడం సోషల్ మీడియాలో పెద్ద పరివాదానికి కారణమైంది.

ఈ వివాదం రెండు దేశాల సహాయ కార్యక్రమాల నాణ్యత, బాధ్యతపై పెద్ద చర్చలను రేకెత్తిస్తోంది. అయితే వర్షాలు, వరదల కారణంగా శ్రీలంకలో ఇప్పటి వరకు 334 మంది ప్రాణాలు కోల్పోయి, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. దేశాన్ని ఆదుకోవడానికి భారత్ ‘ఆపరేషన్ సాగర్ బంధు’ పేరిట సహాయక చర్యలు చేపడుతూ ఇప్పటి వరకు 53 టన్నుల రిలీఫ్ మెటీరియల్ అందించింది. ఈ సమాచారాన్ని శ్రీలంక ప్రభుత్వం సోషల్ మీడియా ద్వారా కూడా ప్రకటించింది.

Read Also: డీకే సీఎం అప్పుడే అవుతారు: సిద్ధరామయ్య

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>