కర్ణాటక రాజకీయం రసవత్తరంగా మారుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్(DK Shivakumar) ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారన్న అంశంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Siddaramaiah) స్పష్టతనిచ్చారు. మంగళవారం డీకే ఇంటికి బ్రేక్‌ఫాస్ట్‌కి సిద్ధూ వెళ్లారు. ఆ తర్వాతే ఆయన ఈ విషయాన్ని వెల్లించారు. బ్రేక్‌ఫాస్ట్ డిప్లొమసీలో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. సీఎం కుర్చీ కోసం సిద్ధరామయ్య, డీకే మధ్య పోటీ నెలకొని ఉంది. ఎన్నికల సమయంలో సీఎంగా సిద్ధరామయ్య తొలి రెండున్నర సంవత్సరాలు ఉంటారని, ఆ తర్వాత డీకే శివకుమార్ ఉంటారన్న ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు దాటి క్రమంలో సీఎంగా డీకే ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారన్నది కీలకంగా మారింది. ఈ కుర్చీ వివాదంపై కాంగ్రెస్ అధిష్టానం కూడా కూడా దృష్టిసారించింది. కొన్ని రోజులుగా కర్ణాటక రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్‌గా ఉంది.
పార్టీ అధిష్ఠానం ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు డీకే శివకుమార్.. సీఎం అవుతారు అని సిద్ధరామయ్య(Siddaramaiah) వెల్లడించారు. ప్రస్తుతం తమ పార్టీ 2028 ఎన్నికలు, స్థానిక ఎన్నికలపై ఫోకస్ పెట్టిందని, ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై కసరత్తులు చేస్తున్నామని ఆయన చెప్పారు. అతి త్వరలో పలు కీలక విషయాలపై చర్చించడానికి తాను, డీకే కలిసి ఢిల్లీ వెళ్లనున్నట్లు సిద్ధరామయ్య చెప్పారు. తమ ప్రభుత్వంలోని నేతలంగా ఐక్యంగా ఉన్నారని, రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పని చేస్తున్నామని ఆయన చెప్పారు.
Read Also: సంచార్ సాధీ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయం: ఆపిల్
Follow Us on: Facebook


