రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా (Rythu Bharosa) రూపంలో ఆర్థిక సాయం అందిస్తుండగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన (PM Kisan) పేరుతో నిధులు ఇస్తున్నది. ఏకకాలంలో రెండు స్కీమ్‌ల కిందా రైతులు సాయం అందుకుంటున్నారు. రాష్ట్రంలో పీఎం కిసాన్ యోజన పథకం కింద లబ్ధి పొందుతున్నవారి వివరాలను బీజేపీ రాజకీయ ప్రయోజనాలకు వాడుకునే సమయంలో అంకెలను ఎక్కువ చేసి చూపెడుతున్నదనే ఆరోపణలు ఉన్నాయి.
రాష్ట్రంలో అధికారికంగా 30 లక్షల మంది పీఎం కిసాన్ స్కీమ్(PM Kisan) ద్వారా లబ్ధి పొందుతున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ క్లారిటీ ఇచ్చింది. గత నెలలో విడుదల చేసిన నిధులపై వివరణ ఇచ్చింది. రాష్ట్రం మొత్తం మీద 29.96 లక్షల మందికి రూ. 599.31 కోట్ల మేర విడుదల చేసినట్లు వివరించింది. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 2.03 లక్షల మంది లబ్ధి పొందుతుండగా ఖమ్మం జిల్లాలో 1.55 లక్షల మంది, నాగర్‌కర్నూల్ జిల్లాలో 1.38 లక్షల మంది, సంగారెడ్డి జిల్లాలో 1.33 లక్షల మంది చొప్పున లబ్ధి పొందుతున్నారు.
Read Also: రోహింగ్యాలకు రెడ్ కార్పెట్ పరవాలా: సుప్రీంకోర్టు
Follow Us On: X(Twitter)


