Panchayat Elections | ఎమ్మెల్యేలు పట్నం వదిలి పల్లెల్లో మకాం వేశారు. అనుచరులను సర్పంచులుగా గెలిపించుకునేందుకు ఎంత చేయాలో అంత చేసేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించేందుకు వాళ్ల అనుచరులు ఎంతో కష్టపడ్డారు. చాలా నియోజకవర్గాల్లో పదేళ్లుగా ఎలాంటి పదవులు లేకపోయినా ఎమ్మెల్యే అభ్యర్థుల వెంటే ఉన్నారు. వాళ్లను గెలిపించేందుకు పల్లెల్లో తిరుగుతూ చాలానే కష్టపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి నాయకులు ఎంతో కష్టపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా వాళ్లకు మాత్రం ఎలాంటి పదవులు లేవు. మార్కెట్ యార్డుల్లో తప్ప ఎలాంటి నామినేషన్ పదవులను కాంగ్రెస్ వాళ్లకు ఇవ్వలేదు.
అందుకే వాళ్లను సర్పంచ్ అభ్యర్థులుగా నిలిపి గెలిపించుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం ఆర్డర్ ఇచ్చింది. ఎమ్మెల్యేలు ఎవ్వరూ హైదరాబాద్ లో ఉండొద్దని.. ఊర్లలోనే ఉంటూ వాళ్లను గెలిపించుకోడానికి పనిచేయాలని సీఎం రేవంత్ ఎమ్మెల్యేలకు టార్గెట్ ఇచ్చేశారు. అందుకే ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరుగుతూ తమ పార్టీ మద్దతు దారులకే ఓటేయాలని ప్రచారం చేస్తున్నారు. పార్టీ నుంచి ఒక్కరే నిలబడేలా ఒప్పిస్తున్నారు.
కొన్ని గ్రామాల్లో స్వయంగా డబ్బులు కూడా ఖర్చు పెడుతున్నారు. గ్రామాల్లో కాంగ్రెస్ కు పట్టు పెరగడం ఎమ్మెల్యేలకు కూడా ఇంపార్టెంట్. మరోసారి పోటీ చేయాలంటే గ్రామాల్లో పార్టీ బలంగా ఉండాలి. ఎక్కువ సర్పంచులు కాంగ్రెస్ వాళ్లే ఉంటే ఆ ఎమ్మెల్యేలకు తిరుగే ఉండదు. పదవిలో ఉన్నంత కాలం ఆ గ్రామాలకు వెళ్లినా ఎమ్మెల్యేలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. పైగా సర్పంచ్ స్థానాలు ఎక్కువ ఉంటే రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిచే ఛాన్స్ ఉంటుంది. ఇలా నియోజకవర్గంలో బలం పెరిగితే ఎమ్మెల్యేలకు పార్టీ అధిష్టానం దగ్గర మంచి పేరు ఉండటంతో పాటు.. ఎమ్మెల్యేలకు పట్టు కూడా పెరుగుద్ది. అనుచరుల బలం ఎంత ఎక్కువ ఉంటే ఎమ్మెల్యేలకు అంత సేఫ్. అందుకే సర్పంచ్ ఎన్నికల్లో ఊర్లన్నీ తిరుగుతున్నారు. బలమైన అభ్యర్థులను నిలబెడుతూ.. కుల సంఘాలకు, గ్రామాలకు కొన్ని హామీలు కూడా ఇస్తున్నారు. తమ అభ్యర్థిని గెలిపిస్తే ఆ ఊరికి ఏం చేస్తారో కూడా చెప్పేస్తున్నారు.
Panchayat Elections | వీలైన గ్రామాల్లో ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అలా ఏకగ్రీవం చేసిన ఊర్లకు స్పెషల్ నిధులు ఇస్తామంటున్నారు. ఇలా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గ్రామాల్లో సందడి చేస్తుంటే.. బీఆర్ ఎస్ మాత్రం లైట్ తీసుకున్నట్టే కనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ ఎస్ నుంచి ఒకరి కంటే ఎక్కువ మందే ఒక గ్రామంలో నిలబడుతుంటారు. వాళ్లను వద్దని చెప్పలేని పరిస్థితి ఉంటుంది. గతంలో కూడా బీఆర్ ఎస్ అభ్యర్థులకే ఎన్నికలను వదిలేస్తుంది. ఇప్పుడు కూడా అదే రిపీట్ చేస్తోంది. గెలిచిన తర్వాత వాళ్లను అభినందించడం ఆ పార్టీకి అలవాటే. ఇక బీజేపీకి గ్రామాల్లో సరిగ్గా అభ్యర్థులే లేరు. ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించట్లేదు. మరి ఏ పార్టీ ఎక్కువ సర్పంచ్ సీట్లు గెలుస్తుందో చూద్దాం.
Read Also: వాయిదాలు కట్టకుంటే ఎన్పీఏ ప్రకటిస్తాం : ఆర్ఈసీ
Follow Us on: Facebook


