సమంత(Samantha).. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు(Raj Nidimoru)ను వివాహం చేసుకున్నారు. సోమవారం ఉదయం వీరిద్దరి వివాహం జరిగిందని తెలుస్తోంది. కోయంత్తూరులోని ఇషాన్ ఫౌండేషన్(Isha Foundation)లో వీరి వివాహం జరిగినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నారని, ఇటీవల మూడుముళ్ల బంధంలోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకుని.. సోమవారం వివాహం చేసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన ఏమీ వెలువడలేదు. కానీ ఈ వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. నాగచైతన్యతో విడాకుల తర్వాత చాలా కాలం పాటు సమంత ఒంటరిగా ఉన్నారు. కాగా ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ షూటింగ్‌లో రాజ్ నిడిమోరుతో సమంతు పరిచయం ఏర్పడింది.
కాగా చాలా సార్లు వీరిద్దరూ కలిసి కనిపించడంతో వీరిద్దర డేటింగ్‌లో ఉన్నారని చాలా కాలంగా టాక్ నడుస్తోంది. ఇటీవల దీపావళి పండుగను కూడా సమంత(Samantha).. రాజ్‌తో కలిసి జరుపుకున్నారు. దీంతో వారిద్దరూ లవ్‌లో ఉన్నారని అంతా నమ్మేశారు. కాగా ఇప్పుడు డిసెంబర్ 1 సోమవారం ఉదయం వారిద్దరూ విమాహం చేసుకున్నారని తెలుస్తోంది.
Read Also: కోహ్లీ చరిత్రలోనే గొప్ప ఆటగాడు: గవాస్కర్
Follow Us On: X(Twitter)


