విరాట్ కోహ్లీపై టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) ప్రశంసలు కురిపించారు. చరిత్రలో అతి గొప్ప ఆటగాడు కోహ్లీ అని కొనియాడారు. తనతో కలిసి ఆడిన, తనకు ప్రత్యర్థిగా ఆడిన అందరూ ఆటగాళ్ల కంటే కూడా కోహ్లీ( Virat Kohli) గొప్ప ఆటగాని గవాస్కర్ అన్నారు. ‘‘మీరు సచిన్‌ను అధిగమించినప్పుడు ఈ మనిషి ఎక్కడ నిలబడ్డాడో మీకు తెలుస్తుంది” అని గవాస్కర్ పేర్కొన్నారు. కోహ్లీని గవాస్కర్ ఒక్కరే కాదు.. ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ రికీ పాంటింగ్ కూడా పొగడ్తల్లో ముంచెత్తారు. కోహ్లీ GOAT అని అన్నాడు.
అయితే రాంచీ వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ విజృంభించాడు. బౌండరీల వర్షంతో ప్రత్యర్థి బౌలర్లను బెంబేలెత్తించారు. 135 పరుగులు చేసి అదరగొట్టారు. ఈ సెంచరీతో వన్డే కెరీర్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా కోహ్లీ రికార్డ్ సృష్టించాడు. ఇప్పటి వరకు ఈ రికార్డ్ సచిన్ పేరుపై ఉంది. రాంచీలో చేసిన శతకంతో కోహ్లీ ఈ రికార్డ్‌ను తన పేరుపై రాసుకున్నాడు. దీంతో కోహ్లీపై Sunil Gavaskar ప్రశంసలు వెళ్లువెత్తుతున్నాయి.
Read Also: ఢిల్లీ పేలుడు కేసు.. కశ్మీర్లో ఎన్ఐఏ సోదాలు
Follow Us On: X(Twitter)


