epaper
Monday, March 2, 2026
epaper

కొండగట్టులో ఘోర ప్రమాదం.. ఆవేదన వ్యక్తం చేసిన కేటీఆర్

కొండగట్టు(Kondagattu)లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ బొమ్మల షాపులో షార్ట్ సర్క్యూట్ కారణంగా శనివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఒక షాపులో చెలరేగిన మంటలు చాలా వేగంగా పక్క షాపులకు కూడా వ్యాపించాయి. ఈ ఘటనలో దాదాపు 22 షాపులు దగ్దమయ్యాయి. కాగా, ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదని, ఆస్తి నష్టం అంచనా వేస్తున్నామని అధికారులు చెప్పారు. ఈ ఘటనపై స్పందించిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కొండగట్టు(Kondagattu) జరిగిందన్నారు కేటీఆర్(KTR). ఈ ప్రమాదంలో సర్వం కోల్పోయిన ఈ కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. జరిగిన ఆస్తి నష్టం, పూర్తిగా దెబ్బతిన్న వ్యాపారాన్ని, దుకాణాలు ఏమాత్రం పనికిరాని స్థితికి చేరడాన్ని దృష్టిలో ఉంచుకొని, మానవతా దృక్పథంతో ఒక్కో కుటుంబానికి రూ. 30 లక్షల ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానికులకు, నష్టపోయిన కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోకుంటే, పార్టీ తరఫున ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని కేటీఆర్ హెచ్చరించారు.

Read Also: స్థానిక ఎన్నికల్లో భారీగా నామినేషన్లు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!