కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుమారుడు ఆదిత్య వివాహ వేడుక శంషాబాద్ లోని జీఎమ్మెఆర్ ఏరినా లో వైభవంగా జరిగింది. ఈ శుభకార్యానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్వయంగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు, ఇతర ముఖ్య నేతలు కూడా ఈ వేడుకలో పాల్గొని వధూవరులు సూర్య విక్రమాదిత్య, సాక్షిలకు శుభాకాంక్షలు తెలియజేశారు. భట్టి విక్రమార్క కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. రేవంత్ రెడ్డి నూతన దంపతులతో కలిసి ఫొటోలు దిగి, కొద్దిసేపు అక్కడి వారితో ముచ్చటించారు. ఈ వేడుకలో రాజకీయ ప్రముఖులతో పాటు పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.
Read Also: భట్టి కొడుకు పెళ్లిలో కేటీఆర్.. ఆత్మీయంగా పలకరించిన కాంగ్రెస్ నేతలు
Follow Us On: Sharechat

