Mobile Popup Ad
Mobile Popup Ad

నోరూరిస్తున్న హలీం.. ఈ ఏడాది 2 వేల కోట్లకుపైగా వ్యాపారం!

కలం, వెబ్ డెస్క్: రంజాన్ (Ramadan) మాసం కావడంతో హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని ప్రధాన పట్టణాల్లో హలీం ఘుమఘుమలు నోరూరిస్తున్నాయి. భాగ్యనగరంలోని గల్లీ గల్లీలో వెలిసిన హలీం బట్టీలకు ఫుడ్ డిమాండ్ ఉంది. కేవలం స్థానిక విక్రయాలే కాకుండా ఇక్కడి హలీం (Haleem) ఇతర ప్రాంతాలకు సప్లయ్ అవుతోంది. మాంసం, ఇతర ఆహార పదార్థాల ధరలు పెరిగాయి. చిన్న చిన్న రెస్టారెంట్లలో సైతం ఒక ప్లేట్ హలీం రూ. 200 నుంచి రూ. 300 వరకు రేట్లు ఉన్నాయి. ప్రముఖ బ్రాండెడ్ హోటళ్లలో దీని ధర మరింత ఎక్కువగా ఉంది.

ఈ ఏడాది హలీం విక్రయాలు రికార్డు స్థాయికి చేరుతాయని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత ఏడాది సుమారు రూ. 15000 కోట్ల వ్యాపారం జరగ్గా, ఈ ఏడాది హలీం (Haleem) అమ్మకాల టర్నోవర్ సుమారు రూ. 2,000 కోట్లు దాటే అవకాశం ఉన్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సీజన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు లక్ష మందికి పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుండటం విశేషం.

Read Also: ఏపీలో పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీపై సీఎం చంద్రబాబు ప్రకటన

Follow Us On : WhatsApp

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>