epaper
Thursday, March 5, 2026
epaper

ఏపీలో పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీపై సీఎం చంద్రబాబు ప్రకటన

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ  పై ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) శాసనసభలో కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో భవిష్యత్తు జనాభా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కొత్త డ్రాఫ్ట్ పాలసీని రూపొందిస్తున్నట్లు తెలిపారు. 2023 గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ప్రతి ఏడాది సుమారు 6.70 లక్షల మంది పిల్లలు జన్మిస్తున్నారని  సీఎం వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు (Fertility Rate) 1.5 గా ఉందని చెప్పారు.

అయితే సుస్థిర అభివృద్ధి (Sustainable Development) కోసం ఈ రేటు 2.1గా ఉండటం అవసరం అని పేర్కొన్నారు. జనాభా సమతుల్యత కోసం గతంలో కుటుంబ నియంత్రణకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చామని, కానీ మారుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు కొత్త విధానాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు. ఇంకా 2047 నాటికి రాష్ట్రంలో వృద్ధుల జనాభా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు (Chandrababu) పేర్కొన్నారు. ఈ పరిస్థితులను ముందుగానే అంచనా వేసి రాష్ట్ర అభివృద్ధికి అనుగుణంగా పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ (Population Management Policy) రూపొందిస్తున్నట్లు తెలిపారు.

Read Also: టెన్త్ స్టూడెంట్స్‌కు గుడ్‌న్యూస్.. వాట్సాప్‌‌లోనే హాల్ టికెట్స్ డౌన్‌లోడ్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!