epaper
Thursday, March 5, 2026
epaper

ఇరాన్​ ప్రతీకార దాడి.. అమెరికా ఆయిల్​ ట్యాంకర్​ ధ్వంసం

కలం, వెబ్​ డెస్క్​: ఇరాన్​ అన్నంత పనీ చేసింది. శ్రీలంక తీరంలో తమ యుద్ధనౌక ఐరిస్​ దేనాను అమెరికా​ ముంచేయడంపై ప్రతీకారం తీర్చుకుంది. గురువారం పర్షియన్​ గల్ఫ్​లో యూఎస్​ ఆయిల్​ ట్యాంకర్​పై (US Oil Tanker) దాడి చేసింది. ఈ మేరకు ఇరాన్​ రెవల్యూషనరీ గార్డ్​ కార్ఫ్స్​(ఐఆర్​జీసీ) ప్రకటించింది. అయితే, ఈ దాడిని అమెరికా ధ్రువీకరించలేదు.

కాగా, విశాఖపట్నంలో జరిగిన నేవీ ఫ్లీట్​లో పాల్గొని తిరిగి స్వదేశానికి వెళుతున్న ఇరాన్​ యుద్ధనౌక ఐరిస్​ దేనాను (IRIS Dena) బుధవారం అమెరికా ముంచేసిన సంగతి తెలిసిందే. శ్రీలంకలోని గాలె పట్టణానికి 40 నాటికల్​ మైళ్ల దూరంలో, హిందూ మహాసముద్రంలో వెళుతున్న వార్​షిప్​పై టోర్పడోతో దాడి చేసింది. ఈ ఘటనలో అందులో ప్రయాణిస్తున్న 180‌‌ మందిలో 87 మంది చనిపోగా, 78 మందిని శ్రీలంక నావికాదళం రక్షించింది. మిగిలివాళ్లు గల్లంతయ్యారు.

ఈ ఘటనపై ఇరాన్​ తీవ్రంగా స్పందించింది. తమ నౌకను ముంచేసినందుకు అమెరికా చింతించేలా చేస్తామని ఇరాన్​ మంత్రి అబ్బాస్​ అరాగ్చీ ప్రకటించారు. ఆ క్రమంలోనే హర్మూజ్​ జలసంధి వద్ద వెళుతున్న యూఎస్​ ఆయిల్​ ట్యాంకర్​పై (US Oil Tanker) దాడి చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ దాడిలో ఎంతమంది మరణించింది తెలియరాలేదు.

Read Also: మన అతిథిని చంపితే మౌనమా?.. ప్రధానిపై రాహుల్​ విమర్శ

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!