epaper
Thursday, March 5, 2026
epaper

భట్టి కుమారుడి వివాహానికి హాజరుకానున్న సీఎం రేవంత్

కలం, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. కొద్ది సేపటి క్రితమే శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఫ్లైట్ దిగారు. మరికొద్ది సేపట్లో శంషాబాద్ లో జరగనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) కుమారుడి వివాహానికి సీఎం రేవంత్ వెళ్లనున్నారు. ఆ తర్వాత అభిషేక్ సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ నామినేషన్ ప్రోగ్రామ్ లో పాల్గొనబోతున్నారు. నిన్న ఢిల్లీకి వెళ్లిన సీఎం.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.

తెలంగాణలో మావోయిస్టుల లొంగుబాటుపై తీసుకుంటున్న చర్యలు, పునరావాస ఏర్పాట్లపై అమిత్ షాకు (Amit Shah) వెల్లడించారు. అలాగే ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయబోతున్న కొత్త కమిషనరేట్ కోసం ఐపీఎస్ అధికారులను కేటాయించాలంటూ సీఎం రిక్వెస్ట్ చేశారు. తెలంగాణ భద్రత కోసం, సైబర్ నేరాల అదుపుకోసం తీసుకుంటున్న చర్యల గురించి కూడా సీఎం రేవంత్  (Revanth Reddy) వివరించారు.

Read Also: ‘సర్’ ప్రక్రియలో పస్ట్ స్టెప్ స్టార్ట్.. నేడు, రేపు కీలక నిర్ణయాలు

Follow Us On: X(Twitter)

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!