epaper
Wednesday, March 4, 2026
epaper

కేంద్ర కేబినెట్​లోకి నితీశ్​.. బిహార్​ సీఎం పీఠంపై కమలం?

కలం, వెబ్​ డెస్క్​: కేంద్రంలోని ఎన్​డీఏ కూటమి (NDA Alliance) ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బిహార్​ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్​ కుమార్​ను(Nitish Kumar) కేంద్ర కేబినెట్​లోకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దీనికోసం ఆయన్ని రాజ్యసభకు పంపనుంది. దీనిపై ఇప్పటికే నితీశ్​కు సమాచారం అందించారని, ఆయన ఓకే చెప్పారని ప్రచారం జరుగుతోంది. అలాగే నితీశ్ కేంద్ర రాజకీయాల్లోకి వెళితే బిహార్​ పగ్గాలు బీజేపీకి అప్పగిస్తారని తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని, మార్పులు జరగడమే మిగిలి ఉందని ఎన్​డీఏ వర్గాలను ఉటంకిస్తూ నేషనల్​ మీడియా చెబుతోంది.

కుమారుడి కోసమే?

కాగా, వారసత్వ రాజకీయాలకు తాను వ్యతిరేకం అని చెప్పుకునే నితీశ్​ కుమార్ (Nitish Kumar)​ తన అభిప్రాయం మార్చుకున్నారు. తన కుమారుడు నిశాంత్​ కుమార్​ను (Nishant Kumar) ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు ఎలాంటి అభ్యంతరమూ లేదని ఇటీవల ఓ సమావేశంలో వెల్లడించారు. అంతకుముందు, జేడీయూకు చెందిన పలువరు సీనియర్​ నేతలు ఇదే విషయాన్ని తెలిపారు. నిశాంత్​ను రాజ్యసభకు పంపేందుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు చెప్పారు. అయితే, అనూహ్యంగా ఇప్పుడు నితీశ్​ కుమార్​ను కేంద్ర కేబినెట్​లోకి తీసుకుంటారనే వార్తల నేపథ్యంలో.. ఆయనతోపాటు ప్రశాంత్​ను కూడా రాజ్యసభకు పంపుతారా? లేకపోతే జేడీయూ పగ్గాలు అప్పగించి రాష్ట్ర రాజకీయాల్లో తీర్చిదిద్దుతారా? అనే చర్చ జరుగుతోంది. మొత్తానికి కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసమే నితీశ్​ ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు.

Read Also: లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత గణపతి..?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!