కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాజ్యసభ (Rajya Sabha) స్థానంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రం నుంచి ఖాళీ అయిన రెండు రాజ్యసభ స్థానాల్లో ఒకటి అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించిన విషయం తెలిసిందే. మరో స్థానం ఎవరికి కేటాయిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ అంశంపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేడు ఢిల్లీకి బయలుదేరారు. ఆయనతో పాటు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. కానీ, చివరి నిమిషంలో ఆయన పర్యటన రద్దయ్యింది. మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్ అందుబాటులో లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
మధ్యాహ్నం జూమ్ మీటింగ్‌లో రాజ్యస్థానం కేటాయింపుపై చర్చించనున్నారు. సాయంత్రంలోగా ఎవరికి కేటాయిస్తారన్న దానిపై క్లారిటీ రానుంది. ఈ పదవి కోసం కాంగ్రెస్ నాయకుల నుంచి తీవ్ర పోటీ నెలకొంది. వేం నరేందర్ రెడ్డి, వినయ్, వీహెచ్, సాంబయ్య పదవిని ఆశిస్తున్నారు. మరి కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
Read Also: ఢిల్లీలో హోలీ వేడుకల్లో రాహుల్ గాంధీ!
Follow Us On: X(Twitter)

