Mobile Popup Ad
Mobile Popup Ad

అన్న వరుసయ్యే అబ్బాయి వేధింపులు.. యువ‌తి సూసైడ్!

క‌లం, వెబ్ డెస్క్‌: జ‌గిత్యాల (Jagtial) జిల్లాలో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ కామాంధుడు వ‌రుసకు చెల్లి అయ్యే అమ్మాయిని ప్రేమ పేరుతో వేధించాడు. త‌న కోరిక తీర్చాల‌ని అమ్మాయికి న‌ర‌కం చూపించాడు. ఈ వేధింపులు త‌ట్టుకోలేక యువ‌తి ఆత్మ‌హ‌త్య (suicide) చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. జ‌గిత్యాల‌కు చెందిన మ‌నోజ్‌కుమార్ త‌న ఇంటి స‌మీపంలో ఉండే చెల్లి వ‌రుస అయిన అక్షయను ప్రేమిస్తున్నానంటూ వేధింపులకు గురిచేశాడు. ఈ క్రమంలో మాయ‌మాట‌లు చెప్పి అక్ష‌య‌ను బలవంతంగా లొంగదీసుకున్నాడు. త‌న కోరిక తీర్చుకొని విషయం ఎవరికైనా చెబితే అక్షయను, ఆమె తమ్ముడిని చంపేస్తాన‌ని బెదిరించాడు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో అక్ష‌య‌ సూసైడ్ నోట్ రాసి, పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.

ఆమెను స్థానిక ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా ప‌రిస్థితి విష‌మించ‌డంతో హైద‌రాబాద్‌కు తీసుకెళ్లాల‌ని వైద్యులు సూచించారు. హైదరాబాద్ తీసుకెళ్ల‌గా అక్క‌డ ఓ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ అక్షయ మృతి చెందింది. మాజీ మంత్రి జీవ‌న్ రెడ్డి అక్షయ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. వేధింపులకు గురి చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు.

Read Also: గాలిలోనే విమానం డబుల్ రివర్స్.. అసలేం జరిగింది?

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>