కలం, వెబ్ డెస్క్: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఢిల్లీలో హోలీ (Holi) వేడుకల్లో పాల్గొన్నారు. ఢిల్లీలోని 24 అక్బర్ రోడ్డులో ఉన్నఏఐసీసీ కార్యాలయం వద్ద హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీకి రంగులు పూసి అందరూ శుభాకాంక్షలు తెలిపారు. రాహుల్ సైతం నాయకులపై రంగులు చల్లుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ రంగుల పండుగ హోలీ అందరి జీవితాల్లో కొత్త ఆశలు, కొత్త ఉత్సాహం, ఆనందాలను నింపాలని రాహుల్ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

