epaper
Tuesday, March 3, 2026
epaper

సీపీ వర్సెస్ కౌశిక్ వ్యవహారంలో ట్విస్ట్.. తెరపైకి సస్పెండ్ ఎస్సై!

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ సీపీ గౌస్ ఆలం, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy)  మధ్య నెలకున్న వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇటీవల హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టి సంచలన ఆరోపణలు చేశారు. సీపీని వృత్తిపరంగా, వ్యక్తిగతంలో టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. తన దగ్గర వీడియో రికార్డింగ్‌లు ఉన్నాయంటూ బాంబు పేల్చారు. సదరు సీపీపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి 15 రోజులు డెడ్‌లైన్ విధించారు. ఆ లోపు చర్యలు తీసుకోకుంటే వీడియోలు రిలీజ్ చేస్తానని ప్రకటించడం సంచలనంగా మారింది. అసలు కౌశిక్ రెడ్డి దగ్గర ఉన్న వీడియో రికార్డింగ్‌లు ఏమిటి? ఆయనకు ఆ వీడియో రికార్డింగ్‌లు అందించింది ఎవరు? అన్న చర్చ సాగుతోంది.

గొడవ ఏమిటి?

వీణవంక సమ్మక్క జాతర సమయంలో హుజురాబాద్‌లో తనను అడ్డుకున్న పోలీసులతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy)  వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే. ఓ సమయంలో సహనం కోల్పోయి సీపీ గౌస్ ఆలంను మతంపేరుతో దూషించారు. మతం పేరుతో దూషించడం వివాదాస్పదంగా మారింది. అది మున్సిపల్ ఎన్నికల సమయం కావడంతో మైనార్టీ ఓట్లకు గండి పడుతుందని భావించి అగ్రనేతలు కౌశిక్ రెడ్డిని మందలించినట్టు సమాచారం. దీంతో ఆయన వెనక్కి తగ్గారు. తనను అడ్డుకున్నారన్న ఫ్రస్టేషన్, ఒత్తిడిలో నోరుజారానని, ఉద్దేశపూర్వకంగా అన్న మాటలు కావని, ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే క్షమించాలని డ్యామేజ్ కంట్రోల్ చేసుకునేందుకు కౌశిక్ రెడ్డి ట్రై చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే స్పీకర్‌కు కంప్లయింట్ చేశారు. ఇటీవల సమ్మక్క జాతర ఘటనపై సీఐడీ ఎంక్వైరీ మొదలు కావడంతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మరోసారి సీపీపై, ఇతర పోలీసాఫీర్లపై తీవ్ర ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

సీపీపై తీవ్ర ఆరోపణలు

కరీంనగర్ సీపీ భార్య ఔట్ సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్నారని, ఆమెతో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లను పంపిస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. హైదరాబాద్‌లో ఉండే తన ఫ్రెండ్ తండ్రి కోసం, అలాగే కరీంనగర్‌లోని ఓ హాస్పిటల్ డాక్టర్‌గా ఉద్యోగం చేసే తన అన్న కోసం సీపీ పోలీస వాహనాలను వినియోగిస్తున్నారంటూ కౌశిక్ తీవ్ర ఆరోపణలు చేశారు. కరీంనగర్‌లో ఇటీవల ఓపెన్ అయిన ఎస్ఎన్ మాల్ నుంచి ఎన్వోసీ కోసం సీపీ రూ.25 లంచం తీసుకున్నారని.. టూటౌన్ సీఐ సృజన్ రెడ్డి, రూరల్ ఏసీపీ విజయకుమార్ ఆ డబ్బులు వసూలు చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు కౌశిక్. గ్రానైట్, ఇసుక క్వారీల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని.. ట్రాన్స్‌ఫర్ల కోసం హోంగార్డుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపించారు. ఆయన ఇంట్లో 20 మంది కానిస్టేబుళ్లు పనిచేస్తున్నారని.. వీటికి సంబంధించిన వీడియో ఆధారాలు తన దగ్గర ఉన్నాయని వెల్లడించారు. సీపీపై చర్యలు తీసుకోకపోతే 15 రోజుల్లో విడుదల చేస్తానని ప్రకటించారు. ఈ ఆరోపణలు సంచలనంగా మారాయి.

ఆరోపణల్లో నిజమెంత?

కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీపీ స్థాయి ఐపీఎస్ ఆఫీసర్ భార్యకు రూ.20 వేలకు మించి జీతం రాని ఔట్ సోర్సింగ్ ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముందన్న చర్చ జరుగుతోంది. ఇదే విషయమై కలం ప్రతినిధి ఆరా తీయగా.. ఆమె చేసేది ఔట్ సోర్సింగ్ ఉద్యోగం కాదని తెలిసింది. హాస్పిటల్ మేనేజ్ మెంట్ కోర్సు చేసిన ఆమె ఆరు నెలల ఇంటర్న్ షిప్ కోసం వెళ్తున్నట్లు తెలిసింది. ఇంటర్న్ షిప్ నే ఔట్ సోర్సింగ్ ఉద్యోగంగా పొరబడినట్లు, ఎమ్మెల్యేకు తప్పుడు సమాచారం వెళ్లినట్టు తెలుస్తోంది.

మరోవైపు ఇటీవల ప్రారంభించిన ఎస్‌ఎన్‌మాల్ ఎన్వోసీ కోసం సీపీ గౌష్ ఆలం (CP Gaush Alam), ఏసీపీ విజయ్ కుమార్, సీఐ సృజన్ రెడ్డి రూ.25 లక్షలు వసూలు చేశారని ఎమ్మెల్యే చేసిన ఆరోపణలను ఆ మాల్ మేనేజింగ్ పార్ట్‌నర్ శ్రీధర్ రెడ్డి ఖండించారు. రాజకీయ దురుద్దేశంతోనే ఆయన ఆరోపణలు చేశారని, అందులో ఎలాంటి నిజం లేదన్నారు. తమ మాల్ త్రీటౌన్ పీఎస్ పరిధిలోకి వస్తుందని, కానీ తమ మాల్ తో ఏ రకంగానూ సంబంధం లేని టూ టౌన్ సీఐ సృజన్ రెడ్డి, రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ పేర్లను ఎమ్మెల్యే ఈ వివాదంలోకి లాగారని తెలిపారు. ఈ ఆరోపణలను పోలీస్ వర్గాలు ఖండించాయి. ఇక రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాల్లో వర్క్ టు ఆర్డర్ మీద ఉన్న హోంగార్డులను తమ సొంతజిల్లాల్లో నాలుగైదేళ్ల క్రితమే అడ్జస్ట్ చేశారు. కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హోంగార్డులు తొమ్మిదేళ్లుగా ఇతర జిల్లాల్లో పనిచేస్తున్నారు. వాళ్లు హోంగార్డులు అనేకసార్లు వినతిపత్రాలు సమర్పించి వేడుకోగా.. ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యకు సీపీ గౌష్ ఆలం పరిష్కారం చూపారు. ఈ క్రమంలో అవినీతి ఆరోపణలు రావడంతో ఆర్ఐని ట్రాన్స్ ఫర్ చేశారని పోలీస్ అధికారులు గుర్తు చేస్తున్నారు.

ఎమ్మెల్యేకు సమాచారం ఇచ్చింది ఎవరు?

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణల్లో నిజానిజాల సంగతి ఎలా ఉన్నా అసలు ఈ సమాచారమంతా ఎమ్మెల్యేకు చెప్పింది సస్పెండ్ అయిన ఎస్సై అనే చర్చ పోలీస్‌శాఖలో జోరుగా నడుస్తోంది. కొంతకాలం క్రితం ఆయన ఇసుక ట్రాక్టర్ల ఓనర్ల నుంచి వసూళ్లు, అవినీతి వ్యవహారంలో సస్పెండయ్యారు. ఈ కోపంతోనే ఆయన సీపీ కుటుంబ సభ్యుల కదలికలపై నిఘా పెట్టడంతోపాటు తనకు తెలిసి పోలీస్ సిబ్బంది ద్వారా ఆరా తీసినట్లు తెలిసింది. దీంతో ఈ వ్యవహారంపై పోలీస్ ఉన్నతాధికారులు సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. గతంలో ఒకసారి తనను మతం పేరుతో దూషించి.. క్షమాపణలు చెప్పడంతో ఎమ్మెల్యే విషయంలో సైలెంట్ అయిన సీపీ గౌష్ ఆలం.. ఈ సారి మాత్రం లీగల్ చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఆరోపణలపై పరువు నష్టం దావా వేయాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Read Also: సచివాలయంలో పొంగులేటి భేటీ: కలెక్టర్లకు కీలక సూచనలు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!