కలం, వెబ్ డెస్క్: ప్రధాని నరేంద్రమోదీ తీసుకుంటున్న చర్యలతో దేశంలో యుద్ధం వచ్చే ప్రమాదం ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) వ్యాఖ్యానించారు. మోడీ చేస్తున్న దుర్మార్గాలు ఒక్కోక్కటి బయటకు వస్తున్నాయన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఈ దుర్మార్గాలను బయటపెట్టాలని పిలుపునిచ్చారు. సోమవారం వికారాబాద్ జిల్లా అనంతగిరిహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ పీఏసీ సమావేశం జరిగింది. దేశంలో జరుగుతున్న పరిణామాలపై పీఏసీలో రాహుల్ గాంధీ చర్చించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టాలని శ్రేణులకు సూచించారు.
బీజేపీపై పోరాడాండి
బీజేపీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలపై పోరాటాలు చేయాలని కోరారు. కాంగ్రెస్ కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధం కావాలన్నారు. ఇరాన్ లాంటి పరిస్థితులు దేశానికి రాకుండా చూసుకోవాలన్నారు. మోదీ చర్యల వల్ల ఇండియాలో యుద్ధం వచ్చే పరిస్థితులు వస్తాయని రాహుల్ పేర్కొన్నారు. ఇండో – అమెరికన్ ట్రేడ్ డీల్ అత్యంత ప్రమాదకరమని అభివర్ణించారు. తెలంగాణలో పార్టీ ప్రభుత్వం కలిసి బాగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. సామాజిక అంశాలపై దృష్టి పెట్టాలన్న సూచించారు. పార్లమెంట్ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ప్రైవేటు బిల్లు పెట్టాలని వీహెచ్ కోరారు. దీనికి రాహుల్ గాంధీ సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.
స్పీకర్ హోదాలో రాలేదు.. ఎమ్మెల్యేగా వచ్చాను: గడ్డం ప్రసాద్
పీఏసీ సమావేశ ప్రాంగణానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ (Gaddam Prasad) కూడా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను స్పీకర్ హోదాలో రాలేదని.. స్థానిక ఎమ్మెల్యేగా రాహుల్ గాంధీ (Rahul Gandhi) ని కలిసేందుకు వచ్చానని చెప్పారు. రాజకీయ అంశాలను రాహుల్ గాంధీతో చర్చించినట్టు చెప్పారు. ప్రోటోకాల్ ప్రకారమే రాహుల్‌ను కలుస్తానన్నారు.
Read Also: రాహుల్ గాంధీ అందుకే వచ్చాడు.. బండి కీలక వ్యాఖ్యలు..!
Follow Us On: Instagram

