కలం, తెలంగాణ బ్యూరో : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam) రౌస్ ఎవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత (Kavitha) నయా స్ట్రాటెజీపై దృష్టి పెట్టారు. సీబీఐ ఛార్జిషీట్‌ను కోర్టు కొట్టివేయడంతో బిగ్ రిలీఫ్ వచ్చిన తర్వాత తల్లితో ఆమె తన ఆనందాన్ని పంచుకున్నారు. ఆమె ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. తండ్రి కేసీఆర్ నుంచి మాత్రం ఎలాంటి రియాక్షన్ రాలేదని ఆమె సన్నిహితుల సమాచారం. తండ్రితో మాట్లాడే ప్రయత్నం గురించి మాత్రం స్పష్టత ఇవ్వలేదు. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాత తండ్రితో మాటల్లేవని, అప్పుడప్పుడూ తల్లితో మాత్రం ఫోన్‌లో సంభాషణలు జరుగుతూ ఉంటాయని తెలిపారు. ‘కడిగిన ముత్యంలా బయటకు వస్తుంది’ అంటూ కేసీఆర్ గతంలో చేసిన కామెంట్లను ఆమె గుర్తుచేసుకుని వాటినే ఆమె మీడియాతో ప్రస్తావించడం గమనార్హం.
గతంలోనూ కేసీఆర్ రెస్పాన్స్ అంతంతే :
పార్టీ నుంచి ఆమె సస్పెన్షన్ కావడానికి ముందు నుంచే కేసీఆర్ (KCR) ఆమెకు ప్రాధాన్యత ఇవ్వడం తగ్గించారన్నది పార్టీ నేతల సమాచారం. కేసీఆర్ స్వల్ప అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరినప్పుడుగానీ, కాళేశ్వరం అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరవడానికి వెళ్ళినప్పుడుగానీ ఆమెకు ఆశించిన స్థాయిలో ఆదరణ లేదన్నది వారి అభిప్రాయం. అదే ట్రెండ్ ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నది. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ఆమె చేస్తున్న కామెంట్లతో బీఆర్ఎస్‌కు డ్యామేజ్ అవుతుందనే అభిప్రాయం ఉండనే ఉన్నది. లిక్కర్ కేసులో కవితపై (Kavitha) ఆరోపణలు వచ్చిన కారణంగానే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి డ్యామేజ్ జరిగిందన్నది చాలామంది గులాబీ లీడర్ల భావన. ఇప్పుడు ఆమెకు కోర్టు నుంచి క్లీన్ చిట్ వచ్చిన తర్వాత తల్లి తరహాలోనే తండ్రి నుంచి కూడా ఆశీర్వాదం వస్తుందని కవిత భావించినా అది జరగలేదన్నది ఆమె సన్నిహితుల సమాచారం.
Read Also: ఇరాన్ దాడులు.. దుబాయ్‌లో చిక్కుకున్న మంత్రి తుమ్మల!
Follow Us On: Youtube

