కలం, వెబ్ డెస్క్: ఇరాన్ దాడుల నేపథ్యంలో దుబాయ్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విమాన సర్వీసులు రద్దు కావడంతో భారత్కు చెందిన పలువురు నటులు, క్రీడాకారులు దుబాయ్ ఎయిర్పోర్ట్లో చిక్కుకున్నారు. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఐదు రోజుల క్రితం కుటుంబసభ్యుల చికిత్స కోసం తుమ్మల దుబాయ్ వెళ్లారు. ఇరాన్ దాడుల ప్రభావంతో విమాన సర్వీసులు రద్దు కావడంతో అక్కడే ఉండిపోయారు. మరోవైపు ఇరాన్ దాడులు మరింత తీవ్రతరం చేసింది. విమాన సర్వీసులు ఎప్పుడు పునరుద్దరిస్తారన్న దానిపై స్పష్టత రావడం లేదు. దీంతో తుమ్మల అనుచరుల్లో ఆందోళన నెలకొంది.
Read Also: అమ్మతో ఒకే.. డాడీతోనే.. క్లీన్చిట్పై కవిత
Follow Us On: Pinterest

