కలం,సినిమా : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన (Buchibabu Sana) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘పెద్ది'(Peddi). వృద్ది సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన క్యూట్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్(A R Rahman) ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. పెద్ది(Peddi) సినిమా ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ సింగల్ రిలీజ్ అయి సోషల్ మీడియాను షేక్ చేస్తుండగా.. తాజాగా సెకండ్ సింగల్‌ను మార్చి 2వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇదిలా ఉంటే హీరో రామ్ చరణ్ ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించి తాజాగా డబ్బింగ్ కూడా మొదలు పెట్టాడు. ప్రస్తుతం చరణ్ డబ్బింగ్ చెబుతున్న క్లిప్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

