కలం, వెబ్ డెస్క్: ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన సీఏ ఫైనల్ పరీక్ష (ICAI CA Final 2026) ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. ఈ పరీక్షలు జనవరి 5,7,9,11,13,26 తేదీల్లో దేశవ్యాప్తంగా నిర్వహించారు. ఫలితాల్లో హర్యానాలోని కర్నాల్‌కు చెందిన దీక్ష గోయల్ 81శాతం మార్కులతో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు. రెండో స్థానంలో హర్యానాకు చెందిన అనిరుధ్ గార్గ్(75.33%) నిలవగా, రిషభ్ జైన్(న్యూఢిల్లీ), ధ్రువ్ దెంబ్లా(హర్యానా) 75.17% మార్కులతో మూడో ర్యాంక్‌ను పంచుకున్నారు.
అభ్యర్థులు ఫలితాలు చూసుకోవడానికి అధికారిక వెబ్ సైట్లో రోల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్‌తో లాగిన్ కావాలి. స్కోర్ కార్డ్ పీడీఎఫ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. దానిని ప్రింట్ తీసుకోవచ్చు. అలాగే డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్కోర్‌కార్డ్‌లో అభ్యర్థి పేరు, రోల్ నంబర్, సబ్జెక్ట్ వారీగా మార్కులు, అగ్రిగేట్, ర్యాంక్ (ఉంటే), పాస్/ఫెయిల్ స్టేటస్, ఇతర వివరాలు ఉంటాయి. మరింత సమాచారం (ICAI CA Final 2026) అధికారిక వెబ్‌సైట్ https://icai.nic.in/ లో తెలుసుకోవచ్చు.

