కలం, సినిమా : సీనియర్ నటుడు శరత్ కుమార్(Sarathkumar) కూతురు, టాలెంటెడ్ నటి వరలక్ష్మి (Varalaxmi) నటించిన లేటెస్ట్ మూవీ ” సరస్వతి”(Saraswathi) ఈ చిత్రాన్ని తానే స్వయంగా తెరకెక్కించారు. ఈ సినిమా మార్చి 6న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఆదివారం మధ్యాహ్నం గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వరలక్ష్మి తల్లి, శరత్ కుమార్ మొదటి భార్య ఛాయా దేవి (Chaya Devi) హాజరై.. నటి రాధిక (Radhika) ను ఎంతగానో ప్రశంసించారు.
దూరదర్శన్లో పని చేసే సమయంలో నటి రాధికను ఇంటర్వ్యూ చేశాను. అది దీపావళి సందర్భంగా విడుదలయింది. అలాగే ‘థాయ్ కెలవి'(Thaai Kelavi) సినిమాలో రాధిక యాక్టింగ్ అద్భుతంగా ఉందని ఛాయా దేవి ఎంతగానో ప్రశంసించారు. ఛాయా దేవిని 1984లో నటుడు శరత్ కుమార్ పెళ్లి చేసుకున్నారు. వీరికి వరలక్ష్మి, పూజ ఇద్దరు కుమార్తెలు.. అయితే 2000 సంవత్సరంలో శరత్ కుమార్ ఛాయా దేవికి విడాకులు ఇచ్చి నటి రాధికను పెళ్లి చేసుకున్నారు. వీరికి రాహుల్ అనే కుమారుడు ఉన్నాడు. శరత్ కుమార్తో విడాకుల తర్వాత కూడా ఛాయాదేవి, రాధికలు మంచి స్నేహితులుగా ఉంటున్నారు. అయితే పిన్ని అయినా కూడా రాధికతో (Radhika) వరలక్ష్మి మంచి బాండింగ్ ఏర్పరుచుకుంది.
Read Also: సీఎం రేవంత్ రెడ్డి కుటుంబాన్ని కలిసిన రష్మిక మందన్న
Follow Us On: Youtube

