epaper
Sunday, March 1, 2026
epaper

‘విరోష్’ ట్రీట్‌.. నేడు దేశ వ్యాప్తంగా అన్న‌దానాలు.. స్వీట్ల పంపిణీ!

క‌లం, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ ప్రముఖ నటులు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ (Vijay Deverakonda), ర‌ష్మిక మంద‌న్నా (Rashmika Mandanna) ఫిబ్రవరి 26న వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మార్చి 4న హైద‌రాబాద్‌లో వీరి వివాహ విందు జ‌రుగ‌నుంది. అంత‌కు ముందే ఈ జంట మరో గుడ్ న్యూస్ చెప్పారు. దేశ వ్యాప్తంగా ఉన్న ప్ర‌జ‌ల‌తో త‌మ సంతోషాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా ర‌ష్మిక, ఎక్స్ వేదిక‌గా ఓ పోస్ట్ పెట్టారు. “ఈ దేశంలోని అందమైన మనుషులు మా ప్రయాణంలో ఎప్పుడూ భాగమే. మా పెళ్లి సంతోషాన్ని మీ అందరితో కలిసి జరుపుకోవాలని కోరుకుంటున్నాం” అని వారు ప్రకటించారు.

భారతదేశంలో ఏ వేడుకైనా మిఠాయిలు, విందుతోనే జరుపుకుంటారని చెప్పిన ఈ జంట, నేడు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో స్వీట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేట్టిన‌ట్లు తెలిపింది. తెలంగాణలో హైదరాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్ నగరాల్లో స్వీట్లు పంపిణీ చేయ‌నున్నారు. అలాగే ఢిల్లీ, చండీగఢ్, ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా, ఘాజియాబాద్, గుజరాత్‌లో అహ్మదాబాద్, మధ్యప్రదేశ్‌లో భోపాల్, మహారాష్ట్రలో ముంబై, రాజస్థాన్‌లో జైపూర్, ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, విజయవాడ, పుట్టపర్తి, కేరళలో కొచ్చి, కర్ణాటకలో మైసూరు, కూర్గ్, బెంగళూరు, తమిళనాడులో కోయంబత్తూరు, చెన్నై, పుదుచ్చేరిలో స్వీట్ల పంపిణీ చేస్తున్నారు.

అలాగే పలు రాష్ట్రాల్లోని ప్రసిద్ధ ఆలయాల్లో అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. కర్ణాటక, ఉత్తరప్రదేశ్, అసోం, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ముఖ్య దేవాలయాల్లో భక్తులకు నేడు అన్నదానం చేయ‌నున్నారు. అభిమానుల ఆశీస్సులు తమకు ఎప్పటికీ అవసరమని పేర్కొంటూ “మీ అందరి ఆశీర్వాదాల కోసం ఎదురుచూస్తున్నాం” అని విజయ్, రష్మిక తెలిపారు.

అన్నదానం జ‌రిగే ఆల‌యాలివే…

1. కర్ణాటక – శివోహం టెంపుల్ (బెంగళూరు)
2. ఉత్తరప్రదేశ్ – శ్రీ శ్రీ కృష్ణ బలరాం మందిర్ (వృందావన్)
3. అస్సాం – శ్రీ రుక్మిణి ఆలయం (గువాహటి)
4. గుజరాత్ – శ్రీ శ్రీ గోవింద ధామ్ టెంపుల్ (ఇస్కాన్), అహ్మదాబాద్
5. కర్ణాటక – పాడి ఇగ్గుతప్ప ఆలయం (కూర్గ్)
6. ఛత్తీస్‌గఢ్ – శ్రీ శ్రీ రాధా రాస్ బిహారి జీ టెంపుల్ (రాయ్‌పూర్)
7. రాజస్థాన్ – గోవింద దేవ్ జీ ఆలయం (జైపూర్)
8. కర్ణాటక – శ్రీ చాముండేశ్వరి ఆలయం (మైసూరు)
9. కర్ణాటక – రాధా కృష్ణ టెంపుల్ – హరే కృష్ణ హిల్ (బెంగళూరు)
10. తమిళనాడు – అరుల్మిగు కోణియమ్మన్ తిరుకోయిల్ (కోయంబత్తూరు)
11. తెలంగాణ – చింతపల్లి సాయిబాబా ఆలయం, చింతపల్లి
12. తెలంగాణ – మన్యం‌కొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం, మహబూబ్‌నగర్
13. తెలంగాణ – హరే కృష్ణ హెరిటేజ్ టెంపుల్, హైదరాబాద్
14. ఆంధ్రప్రదేశ్ – శ్రీ కనక మహాలక్ష్మీ ఆలయం, విశాఖపట్నం
15. ఆంధ్రప్రదేశ్ – ద్వారకా తిరుమల ఆలయం (చిన్న తిరుపతి), ఏలూరు
16. ఆంధ్రప్రదేశ్ – శ్రీ కనకదుర్గ ఆలయం, విజయవాడ

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!