కలం, వెబ్ డెస్క్: టీ20 వరల్డ్‌కప్‌లో మరోసారి ఇండియా–పాకిస్థాన్ (T20 World Cup) పోరు జరిగే అవకాశం ఇంకా ఉంది. అయితే ఈ మ్యాచ్ జరగాలంటే కొన్ని కీలక ఫలితాలు ఒకే దిశగా రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ అవకాశాలు పూర్తిగా సమీకరణాలపైనే ఆధారపడి ఉన్నాయి. టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశలో ఇంగ్లండ్ ఇప్పటికే మూడు మ్యాచ్‌లు గెలిచి సెమీఫైనల్‌కు చేరుకుంది. న్యూజిలాండ్ ప్రస్తుతం 3 పాయింట్లు, మెరుగైన నెట్ రన్ రేట్‌తో రెండో స్థానంలో ఉంది. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కివీస్ ఓడిపోవడంతో సెమీస్ బెర్త్‌పై పాకిస్థాన్ మాత్రం ఇంకా ఆశలు కోల్పోలేదు.
పాకిస్థాన్ సెమీఫైనల్‌కు చేరాలంటే చివరి మ్యాచ్‌లో శ్రీలంకపై భారీ తేడాతో గెలవాలి. అలా జరిగేతే పాకిస్థాన్ ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. లేకపోతే వారి ప్రయాణం అక్కడితో ముగుస్తుంది.
ఇక ఇండియా విషయం చూస్తే ముందు దారి చాలా క్లియర్‌గా ఉంది. వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్‌లో విజయం సాధిస్తే సెమీస్‌కు వెళ్తుంది. ఓడితే ఇంటికి వెళ్తుంది. ఈ రెండు జట్లకు సమీకరణాలు సానుకూలంగా ఫలితాలను ఇస్తే.. మళ్ళీ సెమీ ఫైనల్లో దాయాదులు తలపడే అవకాశాలు ఉన్నాయి. రెండు జట్లు సెమీఫైనల్ మ్యాచ్‌లు గెలిస్తే ఫైనల్‌లో కూడా ఎదురుపడే అవకాశముంది. ప్రస్తుతం ఇండియా మార్గం సులభంగా కనిపిస్తుండగా పాకిస్థాన్ పరిస్థితి కఠినంగా ఉంది. చివరి మ్యాచ్‌ల ఫలితాల తర్వాతే మరో ఇండియా–పాకిస్థాన్ మ్యాచ్‌పై స్పష్టత రానుంది.

