‘మదీనా’ బాధితులకు రేవంత్ అండ.. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేత

కలం, వెబ్ డెస్క్: గతేడాది నవంబర్ 17న సౌదీ అరేబియా మదీనా (Madina) సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 44 మంది హైదరాబాదీయులు సజీవ దహనమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పరిహారం చెక్‌లను అందించారు. మృతుల కుటుంబసభ్యులకు 5 లక్షల చొప్పున పరిహారం అందించారు. అలాగే గాయపడినవారికి 3 లక్షలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.

‘‘ప్రమాదం గురించి తెలియగానే సహాయ చర్యలపైన కేంద్రంతో మాట్లాడా. మంత్రి అజారుద్దీన్‌ను మదీనా పంపించా. బాధిత కుటుంబాలకు 5 లక్షల పరిహారం ఇవ్వాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం. దేశం బయట జరిగే ప్రమాదాలకు ప్రభుత్వాలు పరిహారం చెల్లించదు. కానీ భాదితుల కుటుంబాల పరిస్థితి చూసి సహాయం ప్రకటించాం. నాంపల్లి అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలను కూడా ఆదుకున్నాం. ప్రభుత్వం అండగా ఉంటుందనే నమ్మకం కల్గించడం ముఖ్యం. అందుకే కుటుంబాలను సెక్రటేరియట్‌కు పిలిచి పరిహారం అందించాం’’ అని సీఎం రేవంత్ తెలిపారు.

‘‘ఈ నెల ముస్లిం సోదరులకు చాలా పవిత్రమైంది. అంతా కలిసి మెలిసి ముందుకు వెళ్దాం. కొడంగల్‌లో 2009 నుంచి ప్రతి సంవత్సరం, ప్రతి మండలం నుంచి ఒకరి చొప్పున  హజ్‌కు పంపిస్తున్న’’ అని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>