కలం, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో సాయి దుర్గా తేజ్ (Sai Dharam Tej) హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం సంబరాల ఏటిగట్టు (Sambarala Yetigattu). ప్రస్తుతం ఈ మూవీ సినీ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. రోహిత్ కేపీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని హనుమాన్ నిర్మాతలు కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన అసుర ఆగమనం గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచగా, చిత్ర బృందం ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ (Climax) చిత్రీకరణ జరుగుతోంది. కేవలం ఈ క్లైమాక్స్ భాగం కోసమే నిర్మాతలు దాదాపు 20 కోట్ల రూపాయలకుపైగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. సుమారు 35 రోజులపాటు సాగే ఈ షూటింగ్లో ప్రముఖ స్టంట్ మాస్టర్ కెవిన్ నేతృత్వంలో 18 భారీ యాక్షన్ ఫైట్లు ఉండబోతున్నాయి. ఈ క్లైమాక్స్ ఎపిసోడ్ మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధాన్ని తలపించేలా, అత్యున్నత స్థాయి భావోద్వేగాలతో ఉత్కంఠభరితమైన పోరాటాలతో ఉంటుందని చిత్ర (Sambarala Yetigattu) యూనిట్ చెబుతోంది. ఈ పాత్ర కోసం సాయి దుర్గా తేజ్ తన మేకోవర్‌ను పూర్తిగా మార్చుకుని శక్తివంతంగా కనిపిస్తున్నాడు.
Read Also: కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన రష్మిక మందన్నా!
Follow Us On : WhatsApp

