చట్టసభల్లో కొత్త శకం.. భారత పార్లమెంట్‌కు తొలి LGBTQ+ మహిళ?

కలం, వెబ్ డెస్క్: మేనకా గురుస్వామి (Menaka Guruswamy) రాజ్యసభకు ఎన్నికైతే భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా LGBTQ+ పార్లమెంటేరియన్‌గా సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించిన నలుగురు అభ్యర్థుల్లో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది (Advocate) అయిన మెనకా ఒకరు. గతంలో సెక్షన్ 377ను రద్దు చేయించి, స్వలింగ సంపర్కాన్ని నేరం కాకుండా కీలక పాత్ర పోషించారు. అలాగే వ్యక్తిగత జీవితంలోనూ తాను LGBTQ+ గుర్తింపును బహిరంగంగా ప్రకటించారు.

ఒకప్పుడు ఈ సామాజిక వర్గానికి చెందిన వారు వివక్షకు గురయ్యేవారు. కానీ, నేడు సమాజంలో సానుకూల మార్పులు వస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేక ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ వారిని పేదరికం నుంచి బయటపడేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మేనకా (Menaka Guruswamy) రాజ్యసభకు ఎన్నికైతే చట్టసభల్లో కొత్త శకం మొదలైనట్టుగా భావించవచ్చు.

Read Also: సైనికుల దివ్యాంగ పెన్షన్​పై టాక్స్​ అవమానకరం : రాహుల్​

Follow Us On: Youtube

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>