epaper
Sunday, March 1, 2026
epaper

బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల‌పై ప్రభుత్వం కక్షసాధింపు: హరీశ్ రావు

కలం, మెదక్ బ్యూరో: బీఆర్ఎస్ (BRS) కార్యకర్తలను రోజుకో కేసుతో రేవంత్ సర్కార్ ఇబ్బంది పెడుతున్నదని, రాజకీయంగా ఎదుర్కోలేక పోలీసులను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ నాయకులు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) మండిపడ్డారు. మెదక్ మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ వరుసగా అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేస్తోంద‌ని, ఈ చ‌ర్య‌ల‌ను ఖండిస్తున్నామ‌ని హరీశ్ రావు అన్నారు.

మున్సిపల్ ఎన్నికల సమయం నుంచి మల్లికార్జున్ గౌడ్‌పై (Mallikarjun Goud) కాంగ్రెస్ నాయకులు కక్షకట్టారని, ఇప్పటికే ఆయనపై నాలుగు తప్పుడు కేసులు పెట్టారని ఆ కేసుల్లో ఆయనకు హైకోర్టు స్టే ఇచ్చినా ఎలాగైనా జైలుకు పంపాలన్న దురుద్దేశంతో వెంటనే మరో కొత్త అక్రమ కేసు పెట్టి పోలీసులు అరెస్ట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ దౌర్జన్యానికి నిదర్శన‌మ‌న్నారు. అక్రమ కేసులతో ఇబ్బంది పడుతున్న ప్రతి కార్యకర్తకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అధికార పార్టీ నాయకులకు కొమ్ముకాస్తూ చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్న పోలీసుల తీరు మారాలని హరీష్ రావు (Harish Rao) సూచించారు.

Read Also: రాజ్య‌స‌భ అవ‌కాశం నాకే ఇవ్వాలి: వి.హ‌నుమంత‌రావు

Follow Us On: Instagram

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!