epaper
Sunday, March 1, 2026
epaper

నాగ‌ర్‌క‌ర్నూల్‌లో బాలుడి అనుమానాస్ప‌ద మృతి

క‌లం, వెబ్ డెస్క్‌: నాగ‌ర్‌క‌ర్నూల్ (Nagarkurnool) జిల్లాలో విషాద‌క‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. బిజినేప‌ల్లి మండ‌లంలోని పాలెం గ్రామంలో మూడు నెల‌ల బాలుడు నీటి తొట్టెలో శ‌వ‌మై తేలాడు. భార్య‌భ‌ర్త‌ల మ‌ధ్య కొద్ది రోజులుగా గొడ‌వ‌లు జ‌రుగుతుండ‌టంతో నీల‌మ్మ బాబుతో పాటు త‌ల్లి ఇంట్లో ఉంటోంది. ఇరు కుటుంబాల స‌భ్యుల న‌డుమ శుక్ర‌వారం పంచాయ‌తీ నిర్వ‌హించారు. చివ‌రికి పంచాయ‌తీ ఏ నిర్ణ‌యం తీసుకోక‌పోవ‌డంతో ఇరు కుటుంబాలు ఎవ‌రి ఇళ్ల‌కు వారు వెళ్లిపోయారు. అనంత‌రం అర్ధ‌రాత్రి స‌మ‌యంలో నీల‌మ్మకు బాబు క‌నిపించ‌లేదు. ఇళ్లంతా వెతికినా క‌నిపించ‌క‌పోవ‌డంతో బ‌య‌ట వెత‌క‌గా నీటి తొట్టెలో బాబు శ‌వ‌మై క‌నిపించాడు. బాబు తండ్రే హ‌త్య చేసి ఉంటాడ‌ని నీల‌మ్మ , ఆమె కుటుంబ‌స‌భ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని ప‌రిశీలించారు. కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!