కలం, వెబ్ డెస్క్: మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) ఏపీలో ప్రస్తుత పరిస్థితులపై ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కల్తీ పాలు, కలుషిత నీరుతో ప్రజలు ప్రాణాలను కోల్పోతున్నారని మండిపడ్డారు. టీడీపీ (TDP) నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో డయేరియా, ఫుడ్ పాయిజన్ ఘటనలు ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయని ఆరోపించారు. ప్రజారోగ్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని జగన్ విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు పరిపాలనపై పట్టు లేదన్నారు. ప్రభుత్వ యంత్రాంగం ప్రతిపక్షంపై బురద చల్లడం, అసత్య ప్రచారాలు చేయడం, ‘రెడ్ బుక్ రాజ్యాంగాన్ని’ అమలు చేయడంలోనే నిమగ్నమైందని జగన్ విమర్శించారు.

