epaper
Friday, January 16, 2026
spot_img
epaper

ఇమ్రాన్ ఖాన్ చనిపోయాడా? జైలు అధికారుల క్లారిటీ

పాకిస్థాన్(Pakistan) మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan) చనిపోయాడంటూ ఇటీవల వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఆయనను జైల్లోనే హత్య చేశారంటూ అనుచరులు ఆరోపిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్‌ను వెంటనే చూపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి రావల్పిండి అడియాలా జైలు అధికారులు అధికారిక ప్రకటన విడదుల చేశారు.

జైలు అధికారులు ఖండన జారీ చేస్తూ “ఇమ్రాన్ ఖాన్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. ఆయనను ఎక్కడికీ మార్చలేదు, ఇక్కడే ఉన్నారు. ఆయన ఆరోగ్య స్థితిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ ప్రచారానికి ఎలాంటి ఆధారం లేదు” అని స్పష్టం చేశారు. ఖాన్‌కు ప్రతిరోజూ అవసరమైన వైద్య పరీక్షలు, అవసరమైన ఆహారం, భద్రతా ఏర్పాట్లు అందిస్తున్నామని కూడా పేర్కొన్నారు.

ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై వదంతులు వ్యాపించడమే కాకుండా, ఆయన సోదరీమణులు జైలుకు వెళ్లి కలుసుకునేందుకు ప్రయత్నించినప్పుడు పోలీసులు అడ్డుకున్నారు అనే సమాచారంతో గందరగోళం మరింత పెరిగింది. సోదరీమణులు తమను జైలు గేటు వద్ద నిరోధించారని, దీంతో ఇమ్రాన్ ఖాన్ పరిస్థితిపై సందేహాలు పెరిగాయని పేర్కొన్నారు. ఈ ఘటనతో వదంతులు మరింత బలపడ్డాయి.

జైలు అధికారులు ఈ ఆరోపణలను కొట్టిపారేశారు. భద్రతా కారణాల రీత్యా కుటుంబ సభ్యులను నిరోధించాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. ఇమ్రాన్ ఖాన్‌(Imran Khan)కు ఎలాంటి అనారోగ్య సమస్యలూ లేవని, ఆయన సంపూర్ణ భద్రతలో ఉన్నారని మరోసారి హామీ ఇచ్చారు.

వదంతులు విపరీతంగా వ్యాపించిన నేపథ్యంలో, పాకిస్థాన్ ప్రభుత్వ వర్గాలు కూడా స్పందించాయి. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించాయి. ప్రజలు ధృవీకరించని సమాచారాన్ని నమ్మరాదని, అధికారిక ప్రకటనల పైనా మాత్రమే విశ్వాసం ఉంచాలని సూచించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధికారిక సమాచారం ప్రకారం ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగా ఉన్నారు. ఆయన జైలు లోపలే ఉన్నారు. ఆయన చనిపోయారంటూ జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమేనని జైలు అధికారులు చెబుతున్నారు. అయితే ఇమ్రాన్ ఖాన్ ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఓ వీడియో విడుదల చేయాలని ఆయన అభిమానులు, కుటుంబసభ్యులు కోరుతున్నారు. జైలు అధికారుల ప్రకటనను తాము నమ్మలేమని.. కుటుంబసభ్యులు ఆయనను కలవడానికి అభ్యంతరం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.

Read Also: బ్యాటర్ సత్తా అప్పుడే తెలుస్తుంది: అశ్విన్

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>