కలం, వెబ్ డెస్క్: తమిళ సినీ నటుడు, టీవీకే చీఫ్ విజయ్‌కి (TVK Chief Vijay) షాకులు మీద షాకులు తగులుతున్నాయి. తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ స్థాపించి, తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించిన క్షణం నుంచి ఆయన్ని వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. కరూర్ సభలో తొక్కిసలాట, ‘జననాయగన్’ సినిమాకు సెన్సార్ చిక్కులు, కేసులకు తోడు ఇప్పుడు మరో భారీ షాక్ తగలింది. విజయ్ నుంచి విడాకులు కావాలంటూ ఆయన భార్య సంగీత సోర్నలింగం (Sangeetha Sornalingam) కోర్టు తలుపు తట్టారు.
ఈ మేరకు చెంగల్పట్టు కోర్టులో (Chengalpattu Court) సంగీత విడాకుల పిటిషన్ వేశారు. ఓ సినీ నటితో తన భర్త విజయ్‌కు ఉన్న వివాహేతర సంబంధం కారణంగానే, తాను ఆయన నుంచి విడిపోవాలని కోరుకుంటున్నట్లు పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో ఏప్రిల్ 20న విచారణకు హాజరుకావాలంటూ కోర్టు విజయ్‌కి నోటీస్ ఇచ్చింది. కాగా, 1999లో విజయ్, సంగీత పెళ్లి జరిగింది. తన వీరాభిమాని అయిన సంగీతను విజయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు సంజయ్, దివ్య ఉన్నారు.
మరోవైపు, నటి త్రిషతో విజయ్‌కి(TVK Chief Vijay) సంబంధముందంటూ ఇటీవల తమిళనాడు బీజేపీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై త్రిష(Trisha) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తరువాత ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ, క్షమాపణలు కోరారు. ఈ నేపథ్యంలో విజయ్ సతీమణి సంగీత సైతం తన భర్తకు ఓ సినీ నటితో వివాహేతర సంబంధం ఉండడం వల్లే విడాకులు కోరుతున్నానంటూ పిటిషన్ దాఖలు చేయడం అనేక చర్చలకు తావిస్తోంది.
Read Also : మోడీని కలిసిన టాలీవుడ్ కొత్త జంట
Follow Us On: Pinterest

