కలం, వెబ్ డెస్క్ : కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే ఘటన వెలుగుచూసింది. తనను తాను దేవుడిగా ప్రకటించుకుని అమాయక ప్రజలను నమ్మిస్తున్న ఒక వ్యక్తి, మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించి కటకటాల పాలయ్యాడు. యాదగిరి జిల్లాలోని మహల్ రోజా మఠానికి చెందిన మల్లికార్జున ముత్యా (Mallikarjuna Mutya) అనే వ్యక్తి ఒక చిన్నారితో అనుచితంగా ప్రవహరించాడు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ వీడియోలు కాస్తా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారుల దృష్టికి వెళ్లడంతో వారు వెంటనే స్పందించారు.
నిందితుడి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు, బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారుల ఫిర్యాదు మేరకు షహపూర్ తాలూకాలోని గోగి పోలీస్ స్టేషన్‌లో మల్లికార్జున ముత్యాపై (Mallikarjuna Mutya) పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. భక్తి ముసుగులో ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడటంపై స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: ఇది ప్రభుత్వం కాదు.. రియల్ ఎస్టేట్ కంపెనీ: కేటీఆర్
Follow Us On: Youtube

