epaper
Sunday, March 1, 2026
epaper

మరో మల్టీస్టారర్ మూవీ ప్రకటించిన అనిల్ రావిపూడి..

కలం, డెస్క్ : వరుస హిట్లతో జోష్ మీదున్న అనిల్ రావిపూడి (Anil Ravipudi) గ్యాప్ తీసుకోకుండా మరో మల్టీ స్టారర్ అనౌన్స్ చేశాడు. విక్టరీ వెంకటేశ్ (Venkatesh), నందమూరి కల్యాణ్‌ రామ్ లతో భారీ మల్టీ స్టారర్ మూవీ తీస్తున్నట్టు తాజాగా ప్రకటించాడు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశాడు అనిల్. అలాగే వెంకటేశ్ కూడా ఈ విషయాన్ని పోస్టు చేశాడు. ఈ సినిమాను 2027 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు కూడా అప్పుడే డేట్ ఫిక్స్ చేశాడు. అనిల్ సినిమాలు అన్నీ సంక్రాంతికే వస్తున్న సంగతి తెలిసిందే.

తనకు మొదటి బొమ్మ తీసే ఛాన్స్ ఇచ్చిన నందమూరి కల్యాణ్‌ రామ్ (Kalyan Ram), మొదటి వంద కోట్ల బొమ్మ ఇచ్చిన విక్టరీ వెంకటేశ్ తో మూవీ చేస్తున్నట్టు తెలిపాడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). దీంతో అప్పుడే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. 2026 సంక్రాంతికి చిరంజీవి హీరోగా మన శంకర వర ప్రసాద్ గారు మూవీతో వచ్చి మంచి హిట్ అందుకున్నాడు అనిల్. ఇందులో వెంకటేశ్ గెస్ట్ రోల్ చేశాడు. ఇప్పటికే వెంకీతో నాలుగు సినిమాలు చేసిన అనిల్.. ఇప్పుడు ఐదో మూవీకి రెడీ అవుతున్నాడు. అతి త్వరలోనే ఈ మూవీ షూట్ స్టార్ట్ కానుంది.

Read Also : నిన్న స్నేహితురాలు, నేడు అర్ధాంగి.. పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ ఎమోషనల్ పోస్ట్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!