epaper
Sunday, March 1, 2026
epaper

దర్శకుడి కిడ్నాప్​ కేసులో కన్నడ నటి అరెస్ట్​

కలం, వెబ్​ డెస్క్​: దర్శకుడిని కిడ్నాప్​ చేసి, దారుణంగా హింసించి, దోచుకున్న కేసులో ఓ కన్నడ నటిని (Ash Melo) పోలీసులు అరెస్ట్​ చేశారు. కలకలం సృష్టించిన ఈ సంఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనీశ్​​ ముంబైలో మోడలింగ్​, క్యాస్టింగ్​ ఏజెన్సీ నడుపుతున్నాడు. ప్రస్తుతం ‘జీవద భాషె’ అనే కన్నడ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి పెట్టుబడి విషయంలో అశీ(అశీర్వాద్​)​ అనే వ్యక్తితో గొడవలు ఉన్నాయి. దీనిపై కేసులు కూడా నమోదయ్యాయి.

ఈ క్రమంలో అనీశ్​ హోండా సీఆర్​వీ కారును కొంటామంటూ కొందరు సంప్రదించడంతో ఈ నెల 9న బెంగళూరుకు వచ్చాడు. నగర శివారులోని వాళ్లు సూచించిన ఓ ప్రాంతానికి చేరుకోగానే, అప్పటికే అక్కడ మాటువేసి ఉన్న దుండగులు అనీశ్​ను బంధించారు. కర్రలతో విపరీతంగా కొట్టారు. తమపై పెట్టిన కేసుల విత్​ డ్రా చేసుకోవాలంటూ హింసించారు. అతని ఒంటి మీద నగలు, జేబులో ఉన్న నగదు దోచుకున్నారు. క్రెడిట్​ కార్డులు తీసుకొని డబ్బులు డ్రా చేసుకున్నారు. తీవ్రంగా కొట్టిన తర్వాత సమీపంలోని ఓ ఆస్పత్రిలో వదిలేసి పారిపోయారు.

దీనిపై ఆలస్యంగా ఫిర్యాదు అందండంతో కేసు నమోదు చేసుకున్న ఆడుగోడి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రధాన నిందితుడితోపాటు మరో పది మందిని గురువారం అరెస్ట్​ చేశారు. ఇందులో కన్నడ నటి ఐశ్వర్య (ఆష్​ మెలో) కూడా ఉంది. డైరెక్టర్​ను కిడ్నాప్ చేసి, బెదిరించి, కొట్టి, దోచుకున్న ఘటనలో ఆమె (Ash Melo) ప్రమేయమూ ఉన్నట్లు పోలీసులు నిర్దారణకు వచ్చారు.

Read Also : రెవెన్యూ శాఖ అవినీతిలో కూరుకుపోయింది: హరీశ్ రావు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!