కలం, వెబ్ డెస్క్: సోషల్ మీడియా ఎంత పవర్‌ఫుల్‌గా పని చేస్తుందో మరోసారి రుజువైంది. ఓ సాధారణ యువతి తనకు జరిగిన అన్యాయంపై సోషల్ మీడియా వేదికగా గళమెత్తడంతో తనకు న్యాయం జరిగింది. యువతికి టికెట్ ఇవ్వకుండా మోసం చేసిన రైల్వే టికెట్ క్లర్క్ ఉద్యోగమే ఊడిపోయింది. ఈ ఘటన బీహార్ (Bihar)లో జరిగింది. బీహార్‌కి చెందిన ఒక యువతి ఆనంద్ విహార్ టర్మినల్ (Anand Vihar Terminal) రైల్వే స్టేషన్‌లో టికెట్ కొనడానికి కౌంటర్‌కు వెళ్లింది. టికెట్ కొనడానికి డబ్బులు ఇవ్వగా సదరు రైల్వే క్లర్క్ ఆమెకు చిల్లర డబ్బులు ఇచ్చి టికెట్ ఇవ్వలేదు. ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోకపోవడంతో ఆమె దీన్ని వీడియో రికార్డ్ చేసింది.
ఆమె వీడియోలో తనకు జరిగిన మోసాన్ని, కౌంటర్‌లో క్లర్క్ చేసిన దోపిడీని స్పష్టంగా వివరించింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన వెంటనే అది వైరల్‌గా మారింది. నెటిజన్లు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సదరు మహిళ ధైర్యాన్ని మెచ్చుకున్నారు. వీడియో బాగా వైరల్ కావడంతో రైల్వే అధికారుల దృష్టికి వెళ్లింది. దీనిపై సంపూర్ణ విచారణ చేపట్టిన అధికారులు క్లర్క్‌ను సస్పెండ్ చేశారు. సామాన్య పౌరులకు జరిగే అన్యాయాలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు, న్యాయం జరిగేందుకు సోషల్ మీడియా ఎంత శక్తివంతంగా పని చేస్తుందో చెప్పడానికి బీహార్ (Bihar)లో ఈ ఘటన ఉదాహరణగా నిలిచింది.
Read Also: ఇన్‌స్టాలో మోదీ రికార్డ్.. ప్రపంచ రాజకీయ నేతల్లో అగ్రస్థానం
Follow Us On: Instagram

