కలం, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న (Vijay-Rashmika) తమ పెళ్లి వేడుకల కోసం రాజస్థాన్‌లోని ఉదయపూర్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 26న జరగనున్న వీరి వివాహం కోసం ఉదయపూర్‌లోని ఐటీసీ మెమెంటోస్ రిసార్ట్ ఇప్పటికే ముస్తాబైంది. ఈ వేడుకను అభిమానులు ప్రేమగా పిలుచుకునే విరోష్ (Virosh) అనే పేరుతోనే సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
నిన్న మంగళవారం మెహందీ కార్యక్రమంతో ఘనంగా జరిగింది. బుధవారం హల్దీ, సంగీత్ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ (Viral) అవుతున్నాయి. ముఖ్యంగా రిసార్ట్ పూల్‌లో విజయ్ తన స్నేహితులతో కలిసి వాలీబాల్ ఆడుతున్న దృశ్యాలు, రష్మిక షేర్ చేసిన అందమైన డెకరేషన్ ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
ఈ వివాహ వేడుకను చాలా ప్రైవేట్‌గా, కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలోనే జరుపుకుంటున్నారు. పెళ్లి పూర్తయిన తర్వాత మార్చి 4న హైదరాబాద్‌లో సినీ ప్రముఖులు, ఇతర అతిథుల కోసం ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. కొన్నేళ్లుగా సాగుతున్న వీరి (Vijay-Rashmika) ప్రేమ ప్రయాణం పెళ్లి దాకా చేరడంతో ఇరు కుటుంబ సభ్యుల్లో ఎక్కడా లేని ఆనందం నెలకొంది.

