Mobile Popup Ad
Mobile Popup Ad

ఏడాదిలో 127 కిలోల బంగారం స్మగ్లింగ్ చేసిన రన్యారావు

కలం, డెస్క్ : కన్నడ నటి రన్యారావు (Ranya Rao) కేసులో ఈడీ బుధవారం ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. రన్యారావుతో పాటు మరో ఇద్దరు సిండికేట్ గా మారి.. ఏడాదిలో రూ.102 కోట్ల విలువైన 127 కిలోల బంగారాన్ని అక్రమంగా స్మగ్లింగ్ చేసి.. ఇండియాలోని ప్రముఖ హ్యాండ్లర్లు, జ్యువెల్లర్ నెట్ వర్క్ ద్వారా అమ్మేశారని ఈడీ ఛార్జ్ షీట్ లో తెలిపింది. ఈ కేసులో రన్యారావుతో పాటు తరుణ్ కొండూరు, సహిల్ సకారియా జైన్ లను నిందితులుగా ఈడీ తెలిపింది. దీంతో రన్యారావుకు శిక్ష తప్పేలా లేదు. ప్రస్తుతం ఆమె రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే.

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నటి రన్యారావు (Ranya Rao)  గోల్డ్ స్మగ్లింగ్ కేసు వెనక ఉన్న పెద్ద రాకెట్ ను చేధించేందుకు సీబీఐ, డీఆర్ ఐతో పాటు ఈడీ కూడా విచారణ జరుపుతోంది. కన్నడ ఇండస్ట్రీలో నటిగా గుర్తింపు పొందిన రన్యారావు.. 2025 మార్చి 3న 14 కిలోల గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయారు. ఆ వెంటనే ఐటీ అధికారులు ఆమె ఇంట్లో సోదాలు జరపగా.. పెద్ద ఎత్తున బంగారు నగలు దొరికాయి. రూ.2.5 కోట్ల బ్లాక్ మనీని కూడా గుర్తించారు. అప్పటి నుంచి ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా.. ఈ గోల్డ్ స్మింగ్లింగ్ వ్యవహారం మొత్తం బయటకు వస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>