కలం, ఖమ్మం బ్యూరో: ఓ మహిళా ఎస్ఐ తల్లీబిడ్డను కలిపిన ఘటన ఖమ్మం (Khammam) జిల్లాలో జరిగింది. జిల్లాలోని ముదిగొండ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా హరిత (SI Haritha) బాధ్యతలు నిర్వహిస్తోంది. ముదిగొండ మండలం గంధసిరి గ్రామంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు. ఆ సమయంలో ఒంటరిగా తిరుగుతున్న పదేళ్ల బాలుడిని చేరదీసి విచారించారు. తన పేరు కట్టా పెనుకొండయ్య, జగ్గయ్య పేట అని చెప్పాడు. మిగతా వివరాలు కూడా ఎస్ఐ హరిత తెలుసుకున్నారు. అనంతరం తల్లి కట్టా విజయ కుమారిని స్టేషన్‌కు పిలిచి పిల్లాడిని అప్పగించింది. ఎస్ఐ చాకచాక్యంగా వ్యవహరించి తల్లీబిడ్డను కలిపినందుకు ఆమెను పలువురు ప్రశంసించారు.
Read Also: 15 నిమిషాల శ్రీవారి దర్శనం.. ట్రోల్స్‌పై శివానీ నగరం స్పందన
Follow Us On: Youtube

