కలం, వెబ్ డెస్క్: నటి పూనమ్ కౌర్ (Poonam Kaur) సోషల్ మీడియా వేదికగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఆమె మత మార్పిడి అంశంపై స్పందిస్తూ ఎక్స్‌లో ఆసక్తికర పోస్టు పెట్టారు. కొంతమంది హిందూమతాన్ని కేవలం వేషధారణలో మాత్రమే అనుసరిస్తున్నారని కామెంట్ చేశారు. తమ పిల్లలను కేవలం మూడు నెలల వయసులోనే కాథలిక్ చర్చిలో బాప్తిజం చేయించారని విమర్శించారు. పూర్వీకుల వారసత్వాన్ని మేమెప్పుడూ మార్చలేదని చెప్పారు. గొప్ప కాపు సమాజ వారసత్వం ఆర్థడాక్స్ కాథలిక్ క్రైస్తవ మతంగా, కన్వర్షన్ అంబాసిడర్‌గా మారిపోయిందని విమర్శించారు.
పూనమ్ కౌర్ (Poonam Kaur) చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. మత మార్పిడి, సామాజిక వారసత్వం వంటి సున్నిత అంశాలపై ఆమె చేసిన కామెంట్లపై నెటిజన్లు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆమె అభిప్రాయాలను సమర్థిస్తుండగా, మరికొందరు విమర్శిస్తున్నారు. అయితే ఆమె ఈ కామెంట్లు ఓ ప్రముఖ తెలుగు నటుడు, రాజకీయ నాయకుడిని ఉద్దేశించి చేసినట్లుగా పలువురు నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
Read Also: జింబాబ్వే మ్యాచ్‌కు రింకూ దూరం..!
Follow Us On : WhatsApp

