కలం/ఖమ్మం బ్యూరో: ఇటీవల మేడారం జాతరలో కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ (Vasundhara Yadav) సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఇన్ స్టా, యూట్యూబ్ లో ఆమె వీడియోలు మారు మోగాయి. ఇదిలా ఉంటే తాజాగా వసుంధర యాదవ్ భారీ సైబర్ క్రైమ్‌ను (Cyber Crime) వెలుగులోకి తీసుకొచ్చారు. ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న ముఠాను వసుంధర బృందం అదుపులోకి తీసుకున్నది. అకౌంట్ ఓపెన్ చేస్తే రూ.10 వేలు,ఓపెన్ చేయించిన వ్యక్తికి రూ 20 వేలు అంటూ ఓ ముఠా ఇటీవల మోసాలకు తెగించింది. భద్రాద్రి కొత్తగూడెం (Kothagudem) జిల్లాలోని ధమ్మపేట కు చెందిన వికాస్ చౌదరి, నాగ ప్రియ దంపతులు 2020 నుంచి ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారు. ఈ ముఠాను మంగళవారం మీడియా ముందు ప్రవేశపెట్టిన వసుంధర యాదవ్ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
విదేశీ వ్యక్తులతో సంబంధాలు
ఈ ముఠాను వసుంధర యాదవ్ (Vasundhara Yadav) టీమ్ చాకచక్యంగా పట్టుకున్నది. ఈ ముఠా విదేశాలలోని కొంతమంది వ్యక్తులతో సంబంధాలు ఏర్పరుచుకొని, వారి సహకారంతో కాల్ సెంటర్లు నడుపుతూ వందల కోట్ల ఆర్థిక నేరాలకు తెగబడ్డారు. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, బెట్టింగ్, క్రిప్టో ట్రేడింగ్, గేమింగ్, ఓటీపీ ఫ్రాడ్, మ్యాట్రిమోని వంటి సాకులతో యువతకు వల వేసి అధిక లాభాల ఆశ చూపి మోసం చేస్తూ ఎవరైనా వీరి మాటలకు ఆకర్షితులైతే వారిని టెలిగ్రామ్ లో యాడ్ చేయడం, అనంతరం వివిధ రకాల లింకులు పంపించి డబ్బులు కొల్లగొట్టడం చేసేవారు. ఇలా కొల్లగొట్టిన డబ్బును ఇంతకు ముందే ఏజెంట్ల ద్వారా క్రియేట్ చేసిన ఫేక్ అకౌంట్లోకి మళ్లించి మోస పూరిత మార్గాల ద్వారా వారి ఎకౌంట్లోని డబ్బులు కాజేసేవారు. ఈ విధంగా దాదాపు రూ.547 కోట్లు కొల్లగొట్టారని ఏసీపీ వసుంధర మీడియాకు తెలిపారు. వికాస్ చౌదరి దంపతులతో పాటు మరో 12 మందిని అరెస్ట్ చేయగా 8 మంది పరారీలో ఉన్నారని, వీలైనంత త్వరగా వారిని కూడా పట్టుకుంటామని ఆమె తెలిపారు.
-సైబర్ క్రైమ్ గుట్టు రట్టు చేసిన ఐపీఎస్ అధికారి వసుంధర యాదవ్
-మేడారం జాతరలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిన వసుంధర
-తాజాగా భారీ మోసాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన వసుంధర టీమ్https://t.co/41f7NqVwTa#VasundaraYadav #KallurACP #CyberCrime #Khammam #Kalam #KalamDaily #KalamPaper pic.twitter.com/h4WOQHbMG5— Kalam Daily (@kalamtelugu) February 24, 2026
Read Also: స్టూడెంట్లకు గుడ్ న్యూస్.. మార్చిలో స్కూళ్లకు భారీగా సెలవులు..
Follow Us On: Youtube

