epaper
Monday, March 2, 2026
epaper

కేరళ పేరు మార్పు.. కేబినెట్​ ఆమోదం

కలం, వెబ్​ డెస్క్​: కేంద్ర కేబినెట్​ మంగళవారం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. కేరళ రాష్ట్రం పేరు (Keralam) మార్చాలంటూ ఆ రాష్ట్రం తీసుకున్న నిర్ణయానికి అంగీకరించింది. దీనితోపాటు విద్యుత్​ రంగంలో సంస్కరణలకు ఆమోదం తెలిపింది. అలాగే అహ్మదాబాద్​ మెట్రో ఫేజ్2కు, గోండియా–జబల్​పూర్​ రైల్వేలైన్​ డబ్లింగ్​ పనులతోపాటు మూడు కీలక రైల్వే ప్రాజెక్టులకు కేబినెట్​ ఓకే చెప్పింది.

కేబినెట్​ ఆమోదంతో ఇకపై కేరళ అధికారికంగా కేరళంగా మారనుంది. పేరు మార్పుపై చాలా ఏళ్లుగా ఆ రాష్ట్రం నుంచి కేంద్రానికి తీర్మానాలు, విజ్ఞప్తులు అందాయి. వందల ఏళ్ల నుంచే కేరళ పేరును మలయాళంలో కేరళం అని పిలిచేవాళ్లని ముఖ్యమంత్రి పినరయి విజయన్​ రెండేళ్ల కిందట.. పేరు మార్పుపై తీర్మానం సందర్భంగా చెప్పారు. బ్రిటిషర్లు కేరళమ్​ అని పలకలేక కేరళగా మార్చారని అన్నారు. ఈ విషయంలో కేరళలో(Keralam) రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు లభించింది.

కాగా, ఏదైనా రాష్ట్రం పేరు మార్చాలంటే ఆ రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి, ఆమోదించాలి. అనంతరం రాష్ట్రపతి ఆమోదం తీసుకొని, పార్లమెంట్​లో బిల్లు పెడతారు. ఈ బిల్లు ఆమోదానికి సాధారణ మెజారిటీ చాలు. దీనికి రాజ్యాంగ సవరణ అవసరం లేదు. ఆర్టికల్​ 3 ప్రకారం సాధారణ చట్టం ప్రకారమే చేయొచ్చు. కేంద్ర కేబినెట్​ ఆమోదం తర్వాత అధికారికంగా అన్ని భాషల్లోనూ రాష్ట్రం పేరు మారుతుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!