కలం, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని సహారన్పూర్(Saharanpur)లో జంట హత్యల కేసులో 13 మందికి జీవిత ఖైదు విధిస్తూ కోర్ట్ (Court) తీర్పునిచ్చింది. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం. వీరందరికీ కోర్ట్ రూ.10.73 లక్షల జరిమానా కూడా విధించింది. ఈ 13 మందిలో నలుగురు అన్నదమ్ములు కూడా ఉన్నారు. 2016లో జరిగిన హత్యలకు సంబంధించిన కేసును నేడు విచారించిన సహారన్పూర్ కోర్ట్ ఈ సంచలన తీర్పును వెలువరించింది.
తమ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించారంటూ ఓ కుటుంబం ఆగ్రహంతో ఇద్దరు వ్యక్తులపై దాడి చేసింది. కత్తులతో విచక్షణారహితంగా పొడవడంతో యామీన్, తాసీన్ అనే సోదరులు మృతి చెందారు. దీనిపై 2016 నవంబర్ 12న గంగోహ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దాడి చేసిన వారిలో మునావర్, ముస్తఫా, సన్వర్, ముస్తకీం, షౌకీన్, మొహ్సిన్, అన్వర్, ఇస్లాం, గుల్జార్, జమ్షేద్, పర్వేజ్, అన్వర్, రాకిబ్ తదితరులున్నారు. పోలీసులు కేసు ఫైల్ చేసి కోర్టులో చార్జ్‌షీట్ సమర్పించారు. కోర్టులో ఇరువురి వాదనలు, సాక్ష్యాల ఆధారంగా విచారణ చేపట్టిన న్యాయస్థానం 13 మందికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది.

