Mobile Popup Ad
Mobile Popup Ad

టీ20 వరల్డ్‌కప్‌లో వెస్టిండీస్ రికార్డు

కలం, స్పోర్ట్స్:  ముంబైలోని వాంఖడే స్టేడియం సిక్సర్ల హోరుతో హోరెత్తిపోయింది. సోమవారం జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ (West Indies) జట్టు పరుగుల సునామీ సృష్టించింది. టి20 ప్రపంచకప్ చరిత్రలోనే రెండో అత్యధిక స్కోరును నమోదు చేస్తూ విండీస్ ఆటగాళ్లు రికార్డు పుస్తకాలను తిరగరాశారు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి ఏకంగా 254 పరుగులు రాబట్టింది. 2007లో కెన్యాపై శ్రీలంక చేసిన 260 పరుగుల తర్వాత, వరల్డ్ కప్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. అంతేకాకుండా, ప్రస్తుత 2026 టోర్నీలో ఐర్లాండ్ నమోదు చేసిన 235 పరుగుల రికార్డును కూడా విండీస్ అధిగమించింది.

వెస్టిండీస్ (West Indies) ఇన్నింగ్స్ ఆరంభంలోనే 17 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయినప్పటికీ, వన్‌డౌన్ బ్యాటర్‌గా వచ్చిన షిమ్రాన్ హిట్ మైయర్ విధ్వంసం సృష్టించారు. కేవలం 34 బంతుల్లోనే 85 పరుగులు సాధించిన ఆయన, తన ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు మరియు 7 సిక్సర్లు బాదారు. కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, ఈ టోర్నీలో వేగవంతమైన అర్ధశతకం సాధించిన ఎయిడెన్ మార్క్రామ్, పాతుమ్ నిస్సంకల రికార్డును సమం చేశారు.

వెస్టిండీస్ టి20 చరిత్రలో ఇది మూడవ అత్యధిక స్కోరుగా నిలిచింది. గతంలో సౌత్ ఆఫ్రికాపై 258, ఐర్లాండ్‌పై 256 పరుగులు చేసిన విండీస్, ఇప్పుడు ప్రపంచకప్ వేదికపై తన సత్తా చాటింది. వెస్టిండీస్ తరపున అత్యంత వేగంగా హాఫ్ సెంచరీలు చేసిన షాయ్ హోప్, క్రిస్ గేల్, ఎవిన్ లూయిస్ వంటి దిగ్గజాల జాబితాలో హిట్ మైయర్ కూడా చేరిపోయారు. మొత్తానికి పటిష్టమైన బ్యాటింగ్‌తో వెస్టిండీస్ జట్టు ఈ టోర్నీలో ఫేవరెట్‌గా దూసుకుపోతోంది. ఈ భారీ స్కోరు విండీస్ జట్టులో ఉన్న పవర్‌ను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది.

Read Also: రీల్స్​ పిచ్చి.. హైవేపై డాన్స్​ : యువతులపై కేసు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>