కలం, వెబ్ డెస్క్ : హర్యానాలోని గురుగ్రామ్ (Gurugram)లో రోడ్డు ప్రమాదం నెపంతో ఒక రిటైర్డ్ ఆర్మీ కల్నల్‌పై (Retired Army Colonel) కొందరు దుండగులు అత్యంత దారుణంగా దాడికి పాల్పడ్డారు. మద్యం మత్తులో ఉన్న ఐదుగురు వ్యక్తులు కల్నల్ కారును అడ్డుకుని బీరు సీసాలతో ఆయనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అంతటితో ఆగకుండా ఆయన కారును ధ్వంసం చేయడమే కాకుండా, భయపెట్టి బలవంతంగా డబ్బులను కూడా బదిలీ చేయించుకున్నారు.
సమాచారం అందుకున్న గురుగ్రామ్ (Gurugram) పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సెక్టార్ 50 పోలీస్ స్టేషన్ బృందం ఈ కేసులో దర్యాప్తు చేపట్టింది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు, ఆధారాల మేరకు గాలింపు చేపట్టిన పోలీసులు, దాడికి పాల్పడిన ఐదుగురు నిందితులను గుర్తించి వారిని అరెస్ట్ చేశారు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.
Read Also: టీ20 వరల్డ్‌కప్‌లో వెస్టిండీస్ రికార్డు
Follow Us On: Sharechat

