Mobile Popup Ad
Mobile Popup Ad

నేడు సీఎం స‌మ‌క్షంలో మావోయిస్టుల లొంగుబాటు

క‌లం, వెబ్ డెస్క్‌: తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు (Maoists Surrender) అగ్రనేతలను పోలీసులు నేడు మీడియా ముందుకు తీసుకురానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమక్షంలో వారు ఆయుధాలు అప్ప‌గించ‌నున్నారు. దేవ్ జీ అలియాస్ తిప్పర్తి తిరుపతి, మల్లా రాజిరెడ్డి అలియాస్ చొక్కా రావు, దామోదర్ అలియాస్ నూనె నర్సింహారెడ్డి సహా మొత్తం 18 మంది మావోయిస్టులు ఈ జాబితాలో ఉన్నారు. నేటి నుంచి అధికారికంగా వీరు ఆయుధాలను వీడి సాధారణ జీవితంలోకి అడుగుపెట్టనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఈ లొంగుబాటు జరుగనుంది.

మావోయిస్టు సంబంధిత తాజా పరిణామాలపై నేడు డీజీపీ ప్రెస్ మీట్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలంగాణ పోలీస్ శాఖ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో డీజీపీ శివధర్ రెడ్డి మావోయిస్టుల‌కు సంబంధించి తాజా పరిణామాలు, పోలీసుల చర్యలు తదితర అంశాలపై వివరాలు వెల్లడించ‌నున్నారు.

Read Also: ఓటీటీ క్రైమ్ కంటెంట్ ఔటాఫ్​ కంట్రోల్​… నేరుగా నట్టింట్లోకి!!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>