epaper
Tuesday, February 24, 2026
epaper

తిరుమలలో ఏర్పాట్లపై మీనాక్షి చౌదరి ప్రశంసలు

కలం, డెస్క్ : హీరోయిన్ మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చేసింది. రీసెంట్ గానే ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. తిరుమల దర్శనానికి సంబంధించిన అనుభవాలను పంచుకుంటూ తాజాగా ఓ వీడియో రిలీజ్ చేసింది మీనాక్షి (Meenakshi Chaudhary). ఇందులో ఆమె మాట్లాడుతూ.. ‘నేను తిరుమలకు ఎప్పుడు వెళ్లినా సరే ఎంతో అనుభూతి పొందుతాను. ప్రతిసారి నన్ను నేను మరిచిపోయి శ్రీవారి సేవలో మునిగిపోతుంటాను. తిరుమలలో గాలి కూడా శ్రీవారి నామస్మరణ చేస్తుంది’ అంటూ తెలిపింది మీనాక్షి.

‘నా టూర్ లో నేను కొన్ని విషయాలను గుర్తించాను. అవి మీతో పంచుకుంటున్నాను. తిరుమలలో టీటీడీ అద్భుమైన ఏర్పాట్లు చేసింది. అన్నదానం నుంచి ప్రసాదం దాకా టీటీడీ సిబ్బంది అందిస్తున్న సేవలు మాటల్లో చెప్పలేను. ప్రతి ఐదు నిముషాలకు ఓ ఫ్రీ బస్ వస్తోంది. కచ్చితమైన పరిశుభ్రతను మెయింటేన్ చేస్తున్నారు. ప్రతి బస్ వివరాలను బస్టాండ్ లో డిస్ ప్లే చేస్తున్నారు. దీని వల్ల వృద్ధులు, చిన్న పిల్లలకు ఎంతో ఉపయోగపడుతుంది. అదంతా చూసి టీటీడీకీ థాంక్స్ చెప్పాలి అనిపిస్తోంది. ఇవన్నీ తిరుమల టూర్ ను మరింత హ్యాపీగా మార్చేశాయి’ అంటూ చెప్పుకొచ్చింది మీనాక్షి చౌదరి. ఆమె వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>