బీహార్(Bihar) కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏడుగురు నాయకులపై ఆరేళ్లపాటు వేటు వేసింది. ఈమేరకు బీహార్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(బీపీసీసీ) ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణం అయ్యారని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని పేర్కొంటూ బీపీసీసీ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే క్రమశిక్షణ ఉల్లంఘనలకు పాల్పడిన కారణంగా వారిపై వేటు వేసినట్లు వెల్లడించింది.
కాంగ్రెస్ సేవాదళ్ మాజీ ఉపాధ్యక్షుడు ఆదిత్య పాశ్వాన్, బీపీసీసీ మాజీ ఉపాధ్యక్షుడు షకీలూర్ రెహమాన్, కిసాన్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాజ్ కుమార్ శర్మ, రాష్ట్ర యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాజ్ కుమార్ రాజన్, బీసీ శాఖ మాజీ అధ్యక్షుడు కుందన్ గుప్తా, బంకా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కాంచన కుమారి, నలంద జిల్లా నుండి రవి గోల్డెన్‌లను పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసింది. కాగా ఈ సస్పెండ్‌లను మరో వర్గం తీవ్రంగా ఖండిస్తోంది. ఎన్నికల ఓటమి బాధ్యత నుంచి సీనియర్లను తప్పించడం కోసమే పార్టీ నిర్ణయం తీసుకుందని వారు అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు.
Read Also: అయోధ్య రామాలయంపై కాషాయజెండా ఎగరేసిన ప్రధాని
Follow Us on : Pinterest

